Pushpa 2: ప్రపంచవ్యాప్తంగా పుష్ప మేనియా కొనసాగుతోంది. ఏ నోట విన్న అదే పేరు వినిపిస్తోంది. అసలు సినిమా గురించి మాటలు నిలిచిపోయిన ఈ రోజుల్లో.. టీ దుకాణాల వద్ద అదే చర్చ. మార్కెట్లలో అదే హాట్ టాపిక్. అంతలా ప్రజల్లోకి వెళ్ళింది పుష్పా 2. తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పనవసరం లేదు. రెండు ప్రభుత్వాలు ఈ సినిమా విషయంలో చాలా రకాల మినహాయింపులు ఇచ్చాయి. దీంతో కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం దూసుకెళ్తోంది. తొలి రోజే 294 కోట్ల రూపాయలను వసూలు చేయగలిగింది. సరికొత్త రికార్డుల మోత మోగిస్తోంది. అయితే ఈ సినిమాపై రాజకీయ ప్రభావం కనిపించింది. ఈ చిత్రంపై ఎక్కడ రాజకీయ వివక్ష చూపకుండా కూటమి ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. కానీ వైసీపీ మాత్రం ఓ రకమైన రచ్చ చేసింది. ఫ్లెక్సీలతో పాటు తమ పార్టీ నేతల ఫోటోలతో వైసీపీ శ్రేణులు థియేటర్ల వద్ద హడావిడి చేశాయి. ఒకరిద్దరు నేతలు సైతం ఈ చిత్రం విషయంలో ప్రకటనలు కూడా చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గ కుప్పంలో రెండు థియేటర్లలో పుష్ప2 చిత్ర ప్రదర్శన నిలిచిపోయింది. అధికారులు కలుగజేసుకొని చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు.దీంతో అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
* కుప్పంలో థియేటర్లు సీజ్
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. రికార్డు స్థాయిలో వసూలు చేస్తోంది. బన్నీ ఫ్యాన్స్ ఖుషి గా ఉండగా.. కుప్పంలో రెండు థియేటర్లు మూతపడడం ఆందోళన కలిగిస్తోంది. కుప్పంలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న లక్ష్మీ, మహాలక్ష్మి థియేటర్లు ఒక్కసారిగా మూతపడ్డాయి. అయితే అధికారులు సీజ్ చేయడమే అందుకు కారణం.షో ప్రదర్శిస్తుండగా తనిఖీలు చేసిన అధికారులు థియేటర్లకు ఒక్కసారిగా తాళాలు వేశారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అసలు విషయం తెలుసుకొని షాక్ కు గురయ్యారు.
* నిబంధనలు పాటించడం లేదని
ఈ రెండు థియేటర్లు ఓ టిడిపి నేత ఆధీనంలో ఉన్నాయి. అయితే నిబంధనల ప్రకారం ఈ థియేటర్లకు అనుమతులు లేనట్లు తెలుస్తోంది. లైసెన్సు రెన్యువల్ చేయకుండా, ఎటువంటి ఎన్ఓసి లేకుండా ప్రదర్శనలు కొనసాగిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ కారణంగానే చర్యలకు ఉపక్రమించినట్లు చెబుతున్నారు. అయితే ఇన్ని రోజులు లేనిది.. పుష్ప 2 చిత్ర ప్రదర్శన సమయంలోనే చర్యలకు ఉపక్రమించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ అభిమానులు చర్చకు కారణమవుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pushpa 2 theaters are under siege fans are hurt where
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com