Pushpa 2 First Review : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’ ప్రీమియర్ షోస్ కాసేపట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి. అనేక ప్రాంతాల్లో ఈ సినిమాకి టికెట్ రేట్స్ వెయ్యి కి పైగా పెట్టారు. అయినప్పటికీ కూడా హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోవడం గమనార్హం. యూత్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ క్రేజ్ వేరే లెవెల్ లో ఉంది అనేందుకు ఇదే ఉదాహరణ. నార్త్ అమెరికా లో కేవలం ప్రీమియర్ షోస్ నుండే మూడు మిలియన్ డాలర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు ఈ చిత్రానికి 2.2 మిలియన్ డాలర్స్ వచ్చినట్టు సమాచారం. కేవలం తెలుగు లో మాత్రమే కాదు, హిందీ లో కూడా ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో జరిగాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రీమియర్ షోస్ నుండి పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజు ఈ సినిమాకి ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు మేకర్స్. ఇది సాధారణమైన విషయం కాదు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో దుబాయి లోని కొంతమంది ప్రముఖులకు ప్రత్యేకంగా వేసి చూపించారట. వాళ్ళ నుండి ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలు ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకొని రేంజ్ హై ఇస్తుందని అంటున్నారు. ఆ హైలైట్ సన్నివేశాలెంటో ఒకసారి వివరంగా ఈ కథనంలో చూద్దాం. మొదటి 20 నిమిషాలు ఈ సినిమా వేరే లెవెల్ లో మొదలు అవుతుందట. పార్ట్ 1 తాలూకా లింకులు, పుష్ప అసలు ఏమయ్యాడు అనే దానిపై మొదటి 20 నిమిషాలు ఉంటుందట.
ఆ తర్వాత అల్లు అర్జున్ రూలర్ గా ఎలా ఎదిగాడు అనేది చూపిస్తారట. ఇక ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుందట. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇన్ని రోజులు తమ హీరో సినిమా కోసం ఎదురు చూసిన ఎదురు చూపులకు తగ్గ ఫలితం దక్కిందని ఈ సన్నివేశాలను చూసినప్పుడే అనిపిస్తుంది అట. ఇక సెకండ్ హాఫ్ లో అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ మధ్య వచ్చే సన్నివేశాలు పోటాపోటీగా ఉంటాయట. ఇక క్లైమాక్స్ లో వీళ్లిద్దరి మధ్య వచ్చే ఫైట్ ని చాలా డిఫరెంట్ గా తీసినట్టు తెలుస్తుంది. అలాగే ముగింపు కార్డు పడేటప్పుడు పార్ట్ 3 కోసం దాచిపెట్టిన ట్విస్ట్ వేరే లెవెల్లో ఉండబోతుందని టాక్. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటి అనేది మీరే కాసేపట్లో చూసి తెలుసుకోండి.