Pushpa 2 Pre Release Event: సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు. అందులో వందలాది మంది కార్మికుల కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని ఎవరైనా మూడో వ్యక్తి వచ్చి కదిలిస్తే కన్నీళ్లే వస్తాయి. ఐదేళ్లుగా పుష్ప సినిమా కోసం కష్టపడుతున్న దర్శకుడు సుకుమార్ మాటలకు ఎమోషనల్ అయ్యారు అల్లు అర్జున్. చిత్ర పరిశ్రమలో వారి కెరీర్ దాదాపు అదే సమయంలో ప్రారంభమైంది. వారి సినిమా కెరీర్ విజయవంతంగా చాలా కాలంగా కొనసాగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. దర్శకుడు సుకుమార్ మధ్య ఉన్న అనుబంధం గురించి తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సోమవారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ వేడుక భావోద్వేగంతో నిండిపోయింది. ముఖ్యంగా సుకుమార్, అల్లు అర్జున్, అలాగే సుకుమార్ భార్య తబిత ఇలా అందరూ ఎమోషనల్ అయ్యారు.
పుష్ప 2 రూల్ చేయడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. సుకుమార్, అల్లు అర్జున్ పుష్ప 1 దాని సీక్వెల్ పుష్ప 2 సిరీస్‌లతో సహా దాదాపు ఐదేళ్ల పాటు కలిసి పనిచేశారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో సుకుమార్ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను, అల్లు అర్జున్‌తో తనకున్న రిలేషన్‌షిప్‌ను వీడియో రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ అల్లు అర్జున్‌తో తనకున్న రిలేషన్ గురించి కాస్త ఎమోషనల్‌గా మాట్లాడాడు. ఇలా మాట్లాడుతున్న సమయంలో సుకుమార్, బన్నీ, తబిత కూడా కంటతడి పెట్టుకున్నారు.
ప్రి రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ‘అల్లు అర్జున్ తో ఆర్య నుంచి నా సినిమా జర్నీ స్టార్ట్ అయ్యింది. తాను ఎలా ఎదుగుతూ వచ్చాడో దగ్గరుండి చూశాను. ఒక వ్యక్తిగా, ఒక ఆర్టిస్టుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతగా ఎదిగాడో చూశాను. పుష్ప సినిమా ఇంతగా చేశానంటే ఇది కేవలం తన మీద నాకు ఉన్న ప్రేమతో మాత్రమే. నేను ఏదైనా ఒక సీన్ చెబుతుంటే ఆయన చూపించే ఆసక్తికి నాకు మరింత శక్తిని అందిస్తుంది. చిన్న ఎక్స్‌ప్రెషన్ కోసం కూడా బన్నీ ఎంతో కష్టపడుతాడు. సినిమా మొదలు పెట్టినప్పుడు కథ లేదు. బన్నీకి రెండు సీన్స్ చెప్పి, పాత్ర ఇలా ఉండవచ్చని చెప్పాను. అప్పుడు స్టైలిష్ స్టార్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇంత పెద్ద సినిమాను చేశాను. ప్రతి ఒక్కరికి శక్తిని ఇచ్చే విధంగా మా బన్నీ ఉంటారు. ప్రతి ఒక్కరిని పై స్థాయికి తీసుకు వెళ్లి వర్క్ చేయిస్తాడు. పుష్ప 3 కోసం మరో రెండేళ్లు టైం అడిగితాను. ఈ సినిమాలో రష్మిక అద్భుతంగా నటించింది. శ్రీలీల గొప్పగా డ్యాన్స్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ ఎదుగుదలను చూసి చాలా సంతోషంగా ఉంది. చాలా గ్రాండ్ గా ఈ సినిమాను నిర్మించారు. సినిమా రెండు పార్ట్‌లుగా రావడానికి కారణం చెర్రీ గారు. కుబా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది’ అన్నారు.
‘పుష్ప 2’ సినిమాతో డిసెంబర్ 5న విడుదల కానుంది. రష్మిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసి సినిమా స్థాయిని మరింతగా పెంచింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి భారీ ఎత్తున అభిమానులు హాజరు అయ్యారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 4 సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్‌లతో సందడి చేయబోతుంది.