Pushpa 2 Pre Release Business: గత ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా ఒక్క తెలుగు లో మాత్రమే కాదు, ఇతర ప్రాంతీయ బాషలలో కూడా ఒక్క రేంజ్ లో హిట్ అయ్యింది..ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా సృష్టించిన సునామి మామూలుది కాదు అనే చెప్పాలి..క్రికెటర్స్ దగ్గర నుండి పొలిటిషన్స్ వరుకు ప్రతి ఒక్కరు ‘తగ్గేదెలా’ అనే మ్యానరిజమ్ ని ఇప్పటికి వాడుతూనే ఉన్నారు..అలాంటి సెన్సేషన్ సృష్టించిన సినిమాకి సీక్వెల్ వస్తుంది అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ జరుగుతాయి అనడం లో ఏ మాత్రం అతి సయోక్తి లేదు..ఇప్పటికి షూటింగ్ కూడా ప్రారంబించుకోని పుష్ప పార్ట్ 2 బిజినెస్ అప్పుడే ప్రారంభం అయిపొయింది.

ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 700 కోట్ల రూపాయలకు బయ్యర్లు ఆఫర్ చేస్తున్నారు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇప్పటి వరుకు ఇండియా లో ఏ సినిమాకి కూడా ఈ స్థాయి బిసినెస్ జరగలేదు..బాలీవుడ్ ని శాసిస్తున్న ఖాన్స్ సినిమాలకు, అలాగే ఇటీవల విడుదల అయ్యి బంపర్ హిట్ అయినా రాజమౌళి #RRR సినిమాకి కి కూడా విడుదలకి ముందు ఈ స్థాయి బిజినెస్ జరగలేదు..అలాంటిది పుష్ప పార్ట్ 2 సినిమాకి కేవలం థియేట్రికల్ రైట్స్ నుండే 700 కోట్ల రూపాయిల బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి అంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ముఖ్యంగా ఈ సినిమాకి టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లో అద్భుతమైన క్రేజ్ ఉంది..బాలీవుడ్ లో మొదటి నుండి సీక్వెల్స్ కి ఉండే క్రేజ్ ఎలాంటిదో మన అందరికి తెలిసిందే.
Also Read: Sarkaru Vaari Paata Collections: మహేష్ బాబు బ్రాండ్.. నెగటివ్ టాక్ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్

గతం లో విడుదల బాహుబలి పార్ట్ 2 ఇక్కడ 520 కోట్ల రూపాయిలు వసూలు చేసింది..ఇక ఇటీవలే విడుదల అయినా KGF చాప్టర్ 2 సినిమా కూడా 430 కోట్ల రూపాయిలు వసూలు చేసి సంచలనం సృష్టించింది..ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ 2 గా నిలిచినా సినిమాలు ఇవే..ఇక పుష్ప పార్ట్ 1 తో నార్త్ ఇండియన్స్ ని ఒక్క రేంజ్ ఊపేసిన అల్లు అర్జున్ పార్ట్ 2 తో ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తాడో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read:Acharya Closing Collections : ఆచార్య క్లోజింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్ల నష్టమో తెలిస్తే అవాక్కే
Recommended Videos:
[…] Also Read: Pushpa 2 Pre Release Business: అక్షరాలా 700 కోట్ల రూపాయలు.. … […]
[…] Also Read:Pushpa 2 Pre Release Business: అక్షరాలా 700 కోట్ల రూపాయలు.. … […]