https://oktelugu.com/

Pushpa 2 : అంచనాలను అందుకోలేకపోతున్న ‘పుష్ప 2 : ది రూల్’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..ఇప్పటి వరకు ఎంత గ్రాస్ వచ్చిందంటే!

ఈ సినిమా ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ కూడా భారీ గా పెట్టారు. ఒక్కో టికెట్ 35 డాలర్లు అట. మన ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చూస్తే ఒక్కో టికెట్ మూడు వేల రూపాయలకు పైమాటే. కాస్త టికెట్ రేట్స్ తగ్గిస్తే ప్రీమియర్ షోస్ గ్రాస్ వేరే లెవెల్ లో ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 7, 2024 / 07:55 PM IST

    Pushpa 2: The Rule

    Follow us on

    Pushpa 2 :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ వచ్చే నెల 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. దేశవ్యాప్తంగా పర్యటించి సినిమాని ప్రమోట్ చేసేందుకు ఇప్పటి నుండే రూట్ మ్యాప్ సిద్ధం చేసారు. ముంబై, పూణే, ఢిల్లీ, మహారాష్ట్ర ఇలా అన్ని ప్రధానమైన నగరాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఓవర్సీస్ లో కూడా టూర్స్ ప్లాన్ చేసారు. ఇది ఇలా ఉండగా ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెల రోజుల ముందే నార్త్ అమెరికాలో దాదాపుగా 3000 షోస్ ని ప్లాన్ చేసారు.

    ఈ 3000 ప్రీమియర్ షోస్ నుండి అక్షరాలా నాలుగు లక్షల 50 వేల డాలర్లు వచ్చింది. AMC , రెగల్ లాంటి టాప్ చైన్స్ కి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించేసారు. చూసేందుకు గ్రాస్ నంబర్లు ప్రస్తుతానికి ఎక్కువే ఉన్నప్పటికీ, పది షోస్ కౌంట్ కి చాలా తక్కువే అని చెప్పాలి. దేవర , కల్కి వంటి చిత్రానికి 500 షోస్ లోపు వచ్చిన గ్రాస్, పుష్ప కి 3000 షోస్ వేసిన రాలేదు. సినిమాకి వేరే లెవెల్ క్రేజ్ ఉండుంటే, ప్రస్తుతం షెడ్యూల్ చేసిన షోస్ కి కనీసం 1 మిలియన్ డాలర్లు అయినా దాటి ఉండాలి. కానీ అది జరగలేదు. ఇది ట్రేడ్ కి పెద్ద షాక్. ఎందుకంటే నార్త్ అమెరికా లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 25 మిలియన్ డాలర్లు రావాలి. అంత కలెక్షన్స్ రావాలంటే పుష్ప ప్రీమియర్స్ + మొదటిరోజు కి కలిపి 6 మిలియన్ డాలర్స్ రావాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే 4 మిలియన్ డాలర్స్ వచ్చేట్టు ఉంది. టాక్ రాకపోతే అది కూడా కష్టమే. ఇదే అక్కడి బయ్యర్స్ కి వెన్నులో వణుకు పుట్టించే విషయం.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ కూడా భారీ గా పెట్టారు. ఒక్కో టికెట్ 35 డాలర్లు అట. మన ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చూస్తే ఒక్కో టికెట్ మూడు వేల రూపాయలకు పైమాటే. కాస్త టికెట్ రేట్స్ తగ్గిస్తే ప్రీమియర్ షోస్ గ్రాస్ వేరే లెవెల్ లో ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి ఇలా ఉంటే, ఈ సినిమా నుండి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తప్పుకున్నాడని సోషల్ మీడియా లో ఒక వార్త వినిపిస్తుంది. ఇక నుండి పుష్ప 2 చిత్రానికి థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించనున్నాడు. చివరి నిమిషం లో ఈ మార్పు చేర్పులు చూసి అసలు సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందా అనే భయం అభిమానుల్లో సంతరించుకుంది.