Pushpa 2 Update : వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పుష్ప 2 నుండి ఆయన లుక్ విడుదల చేశారు. పుష్ప సిరీస్లో ఫహాద్ పోలీస్ ఆఫీసర్ భన్వర్ లాల్ షెకావత్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. పార్ట్ 1లో చివర్లో వచ్చి అంచనాలు పెంచేశాడు. పుష్ప ది రైజ్ లో ఫహాద్ కి ఉండేది మూడే సన్నివేశాలు. అవి ఓ రేంజ్ లో పేలాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. క్రూరుడు, అహం కలిగిన పోలీస్ కి పుష్ప ఇచ్చే ట్రీట్మెంట్ బాగుంది. అలాంటి వాడిని రెచ్చగొడితే ఎలా ఉంటుందో పార్ట్ 2లో చూడాలనే ఆసక్తి నెలకొంది.
ఇక పుష్ప 2 నుండి ఆయన లుక్ విడుదల కాగా ఒకింత నిరాశపరిచింది. కారణం ఫహద్ లుక్ సహజంగా లేదు. షెకావత్ ని గుండుతో చూపించిన విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం ఫహద్ జుట్టు తీసేయలేదు. పలు భాషల్లో చిత్రాలు చేస్తూ బిజీగా ఉండే ఫహాద్ పుష్ప కోసం ఆ సాహసం చేయలేదు. అందుకే ప్రత్యేకమైన మేకప్ తో గుండు చేయించుకున్నట్లు చూపించారు. అయితే అది సహజంగా లేకపోవడంతో నిరాశ కలిగింది.
సినిమాలో అయినా ఫహాద్ ఫాజిల్ లుక్ సహజంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఒక పుష్ప 2 మొత్తం పుష్పరాజ్-షెకావత్ మధ్య నడిచే ఆధిపత్య పోరుగా ఉండనుంది. స్మగ్లింగ్ ఆపాలని షెకావత్, ఎవరెంత ప్రయత్నం చేసినా తన దందా ఆపకుండా సాగించే పుష్ప మధ్య ఫైట్ తో కూడిన సన్నివేశాలు థ్రిల్ చేయనున్నాయని సమాచారం. కాగా పుష్ప 2 షూటింగ్ కేవలం 40 శాతం మాత్రమే పూర్తి అయ్యిందట. 2024 సమ్మర్ కి కూడా వచ్చే ఆస్కారం లేదంటున్నారు. షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి సుకుమార్ స్క్రిప్ట్ పూర్తి చేశాడట.
మరలా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయని అంటున్నారు. 2021 డిసెంబర్ లో పుష్ప 1 విడుదల కాగా… వచ్చే ఏడాది అంటే మూడేళ్లకు పార్ట్ 2 రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ రూ. 300 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్. సునీల్, అనసూయ కీలక రోల్స్ చేస్తున్నారు.