Pushpa 2 Dialogues In Politics: ‘పుష్ప’ సిరీస్ అనేది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక భారీ బ్లాక్ బస్టర్ సినిమా మాత్రమే కాదు , ఒక కల్చరల్ ఫినామినా అని చెప్పడం లో ఎలాంటి అతిశయం లేదు. ఈ చిత్రం లోని అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, డైలాగ్స్ , సన్నివేశాలు మన నిజ జీవితం పై ఎంతో ప్రభావం చూపించాయి. క్రీడాకారుల దగ్గర నుండి , రాజకీయ నాయకుల వరకు , ప్రతీ ఒక్కరు ఈ చిత్రం లోని మ్యానరిజమ్స్ ని , డైలాగ్స్ ని ఉపయోగించే వారే. అంతే కాకుండా ‘పుష్ప 2’ చిత్రం ప్రభావం తెలుగు రాజకీయాలపై ఏ రేంజ్ లో చూపించిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రం లోని ‘రప్పా రప్పా’ డైలాగ్ ని వైసీపీ నాయకులూ ఉపయోగించడం పెద్ద సంచలనం గా మారింది.
‘2029 ఎన్నికల్లో మా వైసీపీ పార్టీ అధికారం లోకి రాగానే , ఒక్కొక్కరిని గంగమ్మ తల్లి జాతర లో పొట్టేలు ని నరికినట్టు , రప్పా రప్పా నరుకుతాం’ అని ప్లకార్డులతో వైసీపీ కార్యకర్తలు ర్యాలీ చేయడం , అలా బెదిరింపుల చేసిన వైసీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కేసులు వేయడం పెద్ద సంచనలం గా మారింది. ఇప్పుడు ‘రప్పా రప్పా’ అనే డైలాగ్ , వైసీపీ పార్టీ లేటెస్ట్ స్లోగన్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ ‘పుష్ప 2’ మేనియా తమిళనాడు రాజకీయాలను కూడా ఆవహించింది. రీసెంట్ గా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాల్లో , ప్రతిపక్ష నేత స్టాలిన్ , సీఎం విజయ్ పై కొన్ని ఘాటు విమర్శలు చేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఎన్నికల్లో సీఎం విజయ్ టీవీకే పార్టీ కి సంపూర్ణమైన మెజారిటీ రాలేదని , 63 శాతం మంది తమిళ ప్రజలు విజయ్ కి వ్యతిరేకంగా ఓట్లు వేశారని, మెజారిటీ రాకపోయినప్పటికీ కూడా , ఆయన ‘పుష్ప 2′ సినిమాలో మాదిరిగా ప్రతీ పార్టీ ఇంటికి ఒక డబ్బుల సోఫా పంపించి, వాళ్ళని కొనేస్తున్నాడని , ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం కాబట్టి , మేము ఈ సభ నుండి వాకౌట్ చేస్తున్నాము’ అంటూ ఆయన అసెంబ్లీ నుండి తన పార్టీ నేతలతో కలిసి బయటకు వెళ్ళిపోయాడు. అయితే ఆయన వాడిన ఈ ‘పుష్ప 2′ సోఫాలు’ డైలాగ్ ఇప్పుడు తమిళనాడు లో పెద్ద చర్చకు దారి తీసింది. అలా ఒక పక్క తెలుగు రాజకీయాలను , మరో పక్క తమిళ రాజకీయాలను ‘పుష్ప 2’ చిత్రం తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.