
Pushpa 2 : పాన్ వరల్డ్ లో ఉన్న సినీ ఆడియన్స్ మొత్తం ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప : ది రూల్’ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి చిన్న గ్లిమ్స్ వీడియో ని విడుదల చేయగా ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.అన్నీ భాషలకు కలిపి ఈ వీడియో కి యూట్యూబ్ లో వంద మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.
దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారు అనేది. గ్లిమ్స్ వీడియో కంటే కూడా, ఫస్ట్ లుక్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో తారాగణం కూడా పెరిగిపోతూ ఉంది. సుకుమార్ తెరకెక్కించిన ‘నాన్నకు ప్రేమతో’ , ‘రంగస్థలం’ సినిమాల్లో జగపతి బాబు పాత్రలకు ఎంతటి స్పందన వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
అయితే ‘పుష్ప’ సినిమాలో మాత్రం జగపతి బాబుకి ఏ పాత్ర లేదు ఏమిటబ్బా అని అందరూ అనుకున్నారు.కానీ సుకుమార్ పార్ట్ 2 లో ఆయనకీ అదిరిపోయే రేంజ్ పాత్రని ఇచ్చాడని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో జగపతి బాబు తెలిపాడు.అయితే ఆయనది ఇందులో పాజిటివ్ రోలా, లేదా నెగటివ్ రోలా అనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
త్వరలోనే ఆయన షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్టు కూడా తెలిపాడు.ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న సినిమాలో జగపతి బాబు కి ఒక పవర్ ఫుల్ రోల్ రావడం అనేది నిజంగా ఆయన అదృష్టం అనే చెప్పాలి.ఈ సినిమా హిట్ అయితే జగపతి బాబు కి కూడా ఒక రేంజ్ లో పేరు ప్రఖ్యాతలు వస్తాయి.మరో రెండు దశాబ్దాలు ఆయన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో మోస్ట్ బిజీ ఆర్టిస్టుగా కొనసాగొచ్చు.