Pushpa 2 : సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియాలో తన సత్తాను చాటుతున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఒక్కసారిగా తన స్టామినా ఏంటో చూపిస్తూ 500 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టిన తెలుగు హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ విధంగా తన నటనతో నేషనల్ అవార్డు ని కూడా గెలుచుకున్నాడు.
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పుడు తెలుస్తున్న మ్యాటరెంటంటే పుష్ప 2 దర్శకుడు అయిన సుకుమార్ ఈ సినిమాను భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంటర్వెల్ లో ఒక భారీ ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అది ఏంటి అంటే ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఎవరైతే తన ప్రాణం మిత్రుడని పుష్ప అనుకుంటున్నాడో ఆ కేశవ గాడే పుష్ప ను పొడిచి చంపాలని చూస్తాడట.
ఇక అందులో భాగంగానే పుష్ప కడుపులో రెండుసార్లు కత్తితో పొడుస్తాడట. ఇక ఇంటర్వెల్ తర్వాత నుంచి పుష్ప తనని చంపడానికి ఎవరేవరు సుపారీ ఇచ్చారో తెలుసుకొని వాళ్ళందరినీ ఏరి పారేయడమే లక్ష్యంగా పెట్టుకుంటడట.. ఇక అందులో భాగంగానే సుకుమార్ ఈ సినిమా స్క్రీన్ ప్లే మొత్తాన్ని చాలా ఫాస్ట్ గా నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సుకుమార్ ఈ సినిమా షూటింగ్ ను చాలా వేగంగా పూర్తి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా మేకింగ్ పరంగా చాలా ఎక్కువ రోజులు తీసుకుంటుంది. సుకుమార్ ఏ సినిమాకు లేనంత విధంగా ఈ సినిమా కోసం మేకింగ్ పరంగా ఎక్కువ రోజులు తీసుకున్నాడట. అందుకే మరి లేట్ చేస్తే వీలుకాదని ఈ సినిమాని తొందరగా ఫినిష్ చేసే పనిలో పడ్డాడట…ఇక మొత్తానికైతే పుష్ప 2 ఇంటర్వెల్లో ఒక అదిరిపోయే ట్విస్ట్ ని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నట్టుగా సోషల్ మీడియా లో ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది…