Pushpa 2 TRP Ratings : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ‘పుష్ప 2′(Pushpa 2 Movie) మేనియా అప్పుడే అయిపోయింది అని అనుకుంటున్నారా?, అలా అనుకుంటే ముమ్మాటికీ పొరపాటే. ఈ చిత్రం మేనియా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. థియేటర్స్ లో 1800 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించిన తర్వాత ఈ సినిమా ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. థియేటర్స్ లో ఎగబడి చూసేసారు కదా, ఇక నెట్ ఫ్లిక్స్ లో ఏమి చూస్తారు లే అని చాలా మంది అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 వారాల పాటు నాన్ స్టాప్ గా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో కూడా అందరూ చూసేసారు కదా, ఇక టీవీ టెలికాస్ట్ లో ఎవరు చూస్తారు లే, బలమైన ప్రభావం పడుతుందని అంతా అనుకున్నారు.
కానీ ఈ చిత్రం ఆ అంచనాలను కూడా తలక్రిందులు చేసింది . మొదటి సారి స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేసినప్పుడు దాదాపుగా 13 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. ఈమధ్య కాలం లో విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలన్నిటికంటే ఎక్కువ రేటింగ్స్ ఇవి. థియేటర్స్ లో, ఓటీటీ లో జనాలు ఇరగబడి చూసిన తర్వాత కూడా ఇంతటి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయంటే, ఈ సినిమాకు జనాల్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం థియేట్రికల్ రన్ లో తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్ కి ఎక్కువ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో కూడా ఈ సినిమా హిందీ లో చరిత్ర తిరగరాసింది. BAARC అందిస్తున్న నివేదిక ప్రకారం రీసెంట్ గానే హిందీ వెర్షన్ లో టెలికాస్ట్ కాబడిన ఈ చిత్రానికి 5.1 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చినట్టు చెప్తున్నారు.
ఈమధ్య కాలం లో బాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన ‘స్త్రీ 2’ కి కూడా ఈ రేంజ్ రేటింగ్స్ రాలేదని అంటున్నారు. అంతే కాదు ఈ సీజన్ IPL యావరేజ్ టీఆర్ఫీ రేటింగ్స్ ని తీస్తే ‘పుష్ప 2’ రేటింగ్స్ కంటే తక్కువే ఉన్నాయట. దేశవ్యాప్తంగా హిందీ వెర్షన్ ని 5 కోట్ల 40 లక్షల మంది టీవీ టెలికాస్ట్ ద్వారా చూసినట్టు తెలుస్తుంది. దీనిని బట్టీ పుష్ప చిత్రం నార్త్ ఇండియన్స్ కి ఒక సినిమా కాదు, బ్రాండ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ చిత్రం హిందీ యూత్ ఆడియన్స్ పై అమితంగా ప్రభావం చూపించింది. ఒక సినిమాకు ఆడియన్స్ ఈ రేంజ్ లో బ్రహ్మరథం పట్టడం ఈ మధ్య కాలంలో పుష్ప కి మాత్రమే జరిగింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ బాలీవుడ్ లో ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.
Highest TVR in india #Pushpa2 Hindi Premiere – 5.1 #IPL2025 Final – 4.6
OTR Era lo , Close to 4Hrs movie tho Late Telecast tho kuuda
IPL Final kanna Ekkuva TRP Pettadam entra Mentaloda @alluarjun pic.twitter.com/u29k5eaMsb
— bunny vishwak ️ (@bunnyboy423) June 14, 2025