Pushpa 2 : ఏ హీరోకి అయినా ఒక సినిమా ద్వారా కనీవినీ ఎరుగని రేంజ్ బలమైన ఇమేజ్ ఏర్పడితే ఆ ఇమేజ్ నుండి బయటకు రావడానికి చాలా సమయం పట్టేది. ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పండుగాడు క్యారక్టర్ నుండి బయటకి రావడానికి మహేష్ బాబుకు (super star mahesh babu) మూడేళ్ళ సమయం పట్టింది. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన మూడు సినిమాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అదే విధంగా ఎన్టీఆర్(Junior ntr) కి కూడా సింహాద్రి ఇమేజ్ నుండి బయటకి రావడానికి చాలా సమయం పట్టింది. ఇలా ఐకానిక్ రోల్స్ చేసిన హీరోలందరికీ ఆ రోల్స్ కి సంబంధించిన ఇమేజ్ నుండి బయటకి రావడానికి చాలా సమయం వృధా అయ్యేది. ఇప్పుడు అల్లు అర్జున్(Icon star Allu Arjun) కి కూడా అదే జరగబోతుందా అనే భయం అభిమానుల్లో ఉంది. ఎందుకంటే నాలుగేళ్ల నుండి ఆయన ‘పుష్ప'(Pushpa 2: the rule) గెటప్ లోనే ఉన్నాడు.
దేశం మొత్తం ఇప్పటికీ పుష్ప మేనియా నుండి బయటకు రాలేదు. అంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ క్యారక్టర్ నుండి అల్లు అర్జున్ బయటకి రావడం అనేది సాధారణమైన విషయం కాదు. అల్లు అర్జున్ ని చూస్తే ఇప్పుడు పుష్ప మ్యానరిజమ్స్, ఆ క్యారక్టర్ తాలూకు యాటిట్యూడ్, యాస గుర్తుకొస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే గడిచిన మూడు దశాబ్దాలలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఈ స్థాయి ప్రభావితం చేసిన క్యారక్టర్ లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఈ క్యారక్టర్ ని తన తదుపరి చిత్రంతో జనాలు మర్చిపోయేలా చేయడం అల్లు అర్జున్ కి అగ్ని పరీక్ష లాంటిది. ఈ క్యారెక్టర్ ప్రభావం కారణంగా తదుపరి చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే సాధ్యమైనంత తొందరగా ఈ క్యారక్టర్ నుండి బయట పడాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. రీసెంట్ గానే సక్సెస్ మీట్ లో ఆయన కొత్త లుక్ మీరంతా చూసే ఉంటారు.
చాలా స్టైలిష్ గా కూల్ లుక్ లో ఆయన కనిపించాడు. త్వరలోనే ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సుబ్రమణ్య స్వామి జీవిత ప్రయాణాన్ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అల్లు అర్జున్ ఈ మూవీ షూటింగ్ కోసం సిద్ధం అయ్యాడు. ఇప్పుడు త్రివిక్రమ్ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. బలమైన మైథాలజీ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో కచ్చితంగా ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఉగాది నుండి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నుండి అల్లు అర్జున్ ఏడాదికి కచ్చితంగా రెండు సినిమాలు చేయాలనే సంకల్పం తో ఉన్నాడు. ఈ చిత్రంతో సమాంతరం గా ఆయన డైరెక్టర్ అట్లీ తో తెరకెక్కించబోయే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటాడని తెలుస్తుంది.