Pushpa 2 Accident: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న ‘పుష్ప 2 ‘ సినిమా షూటింగ్ గురించి తెల్లవారు జామునే ఒక చేదు వార్త వినాల్సి వచ్చింది. పుష్ప 2 జూనియర్ ఆరిస్టులతో షూటింగ్ స్పాట్ కి వెళ్తున్న బస్సు కి ప్రమాదం జరిగింది. నార్కెట్ పల్లి వద్ద ఒక ప్రైవేట్ బస్సు పుష్ప 2 ఆర్టిస్టులు ఉన్న బస్సు ని గుద్దేసింది. ప్రమాదం జరిగిన ప్రదేశం హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే హై వే రూటు మొత్తం ట్రాఫిక్ జామ్ తో నిండిపోయింది.
పలువురు ఆర్టిస్టులకు తీవ్రమైన గాయాలు అవ్వడం తో వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతానికి అయితే ఎవరి ప్రాణాలకు ముప్పు లేదని డాక్టర్లు చెప్పారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన కారణంగా నేడు పుష్ప 2 మూవీ షూటింగ్ ని నిలిపివేశారు. ఈ జూనియర్ ఆర్టిస్టులందరు తిరిగి కోలుకునేవరకు షూటింగ్ ని ఆపేస్తారా?,లేదా ఈరోజు వరకు ఆపేసారా అనేది తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియన్ లెవెల్ లో ప్రతీ ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప 2 . మొదటి భాగం టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. బాహుబలి సిరీస్ మరియు KGF సిరీస్ కి ఇతర భాషల్లో ఏ రేంజ్ లో అయితే రీచ్ ఉందో, పుష్ప కి కూడా అదే రేంజ్ రీచ్ దక్కింది. రీసెంట్ గా విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో మరియు ఫస్ట్ లుక్ పోస్ట్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇండియా మొత్తం ఫస్ట్ లుక్ పోస్టర్ కి షేక్ అయ్యింది.
అప్పటి వరకు ఈ చిత్రం మీద ఉన్న అంచనాలను వంద రెట్లు ఎక్కువ చేసింది ఈ ఫస్ట్ లుక్ పోస్టర్. అల్లు అర్జున్ లాంటి డెడికేషన్ ఉన్న నటుడు ఇండియాలోనే లేదు అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తారు అందరూ. మరి సినిమా చూసినప్పుడు ఆయన అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటాడా లేదా అనేది తెలియాలంటే వచ్చే సమ్మర్ వరకు ఆగాల్సిందే.