Puri Jagannath and Vijay Sethupathi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడి కి చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే విజయ్ సేతుపతి లాంటి నటుడు సైతం భారీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో సైతం ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటున్న సినిమానే కావడం విశేషం…ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటనకి అభిమానులుగా మారిన వాళ్ళు మాత్రం ఉండరు. అయితే పూరి జగన్నాధ్ వరుసగా ప్లాపులను మూట గట్టుకుంటున్న సందర్భంలో ఆయన పూరి జగన్నాధ్ సినిమా చేయడం పట్ల కొంతమంది కొన్ని అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం తనకి ఎవరితో సంబంధం లేదని ఇప్పుడు చెప్పిన కథ నచ్చడం వల్ల ఆయన సినిమాకి కమిట్ అయ్యాను అని ఇంతకు ముందు పూరి జగన్నాథ్ చేసిన సినిమాలతో తనకి అవసరం లేదని ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా తీయగలిగే కెపాసిటి పూరి జగన్నాథ్ కి ఉందని ఆయన చెబుతుండటం విశేషం… మరి మొత్తానికైతే ఈ సినిమాలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి తో ఆ జానర్ లో సినిమా చేస్తున్నాడా..?
ఒక మూడు నుంచి నాలుగు నెలల్లో సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక చాలామంది నటులు చేసే సినిమాలకంటే ఆయన చేసే నటన చాలా కొత్తగా ఉంటుంది. అలాగే ఆయన చేసే ప్రతి పాత్రలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. అందుకే ఆయన చేసే సినిమాలంటే చాలామందికి ఇష్టం…
ఆయన నటన అంటే కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఆయన కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నింటిని పక్కన పెడితే ఇకమీదట తను కొత్త స్టైల్ ని అనుసరిస్తూ చాలా కొత్తగా తనను ప్రజెంట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. పూరి జగన్నాథ్ చెప్పిన కథ చాలా కొత్తగా ఉందట. అందుకోమే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
Also Read : పూరీ,ఛార్మి చేతుల్లో మరో హీరో బలి..? ఫోటోకే వణికిపోతున్న ఫ్యాన్స్!