Puri Jagannath and Vijay Sethupathi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh)…ఒకప్పుడు ఈయన నుంచి సినిమా వస్తుందంటే చాలు ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు సైతం చాలా ఆనందపడేవారు. ఆయన సినిమాలను చూస్తూ ఎంటర్ టైన్ అయ్యేవారు చాలామంది ఉన్నారు. అయితే గత కొద్దిరోజుల నుంచి ఆయన వరుస ప్లాపులను మూట గట్టుకుంటున్నాడు. పాన్ ఇండియాలో చేసిన లైగర్ మూవీ ప్లాప్ అవ్వడంతో అప్పటినుంచి ఇప్పటివరకు తను కోలుకోలేకపోతున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) అంచనాలకు మించి ఆడలేదు. ఈ సినిమా ప్రోటీన్ రొట్ట ఫార్ములాలో సాగింది అంటూ చాలామంది ఈ సినిమా మీద విమర్శలు అయితే చేశారు. ఇక పూరి జగన్నాథ్ పని అయిపోయింది అనుకున్న సందర్భంలో ఆయన విజయ్ సేతుపతి తో ఒక భారీ బడ్జెట్ తో సినిమా చేయబోతున్నాను అంటూ అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా పూరి జగన్నాథ్ మీద అటెన్షన్ అయితే క్రియేట్ అయింది. మరి ఇప్పుడు ఆయన విజయ్ సేతుపతితో ఎలాంటి సినిమా చేస్తున్నాడు అనే దాని మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ సినిమాకి బెగ్గర్ (Beggar) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read : పూరీ,ఛార్మి చేతుల్లో మరో హీరో బలి..? ఫోటోకే వణికిపోతున్న ఫ్యాన్స్!
అంటే ఏ కోణంలో అలాంటి టైటిల్ ని పెట్టారు. ఈ సినిమాలో నిజంగానే హీరో బెగ్గర్ గా నటిస్తాడా? లేదంటే బెగ్గర్ లాంటి క్యారెక్టరైజేషన్ ను పెట్టుకొని అందరి దగ్గరికి వెళ్లి తన ప్రొఫెషన్ లో తనకు కావలసినవి అడిగి రాబట్టుకుంటూ ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది.
మరి మొత్తానికైతే పూరి విజయ్ సేతుపతికి చెప్పిన కథ తనకి బాగా నచ్చిందట. అందువల్లే అతను ఈ సినిమా చేస్తున్నాను అంటూ రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం… మరి పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ప్రస్తుతం విజయ్ సేతుపతి డిఫరెంట్ క్యారెక్టర్లతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు…మరి ఇలాంటి సందర్భంలో ఆయనకి ఈ సినిమా ఎలా యూజ్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది…ఇక మొత్తానికైతే పూరి కంబ్యాక్ ఇవ్వాలంటే ఈ సినిమాతోనే అవుతుంది. ఇది కనక ప్లాప్ అయితే పూరి సినిమా కెరియర్ ఇక క్లోజ్ అయినట్టే.
Also Read : పూరి జగన్నాధ్ విజయ్ సేతుపతి కాంబోలో రానున్న సినిమా స్టోరీ ఇదేనా..?