Puri Jagannadh and Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫెర్ రీమేక్’ గాడ్ ఫాదర్ ప్రస్తుతం మార్పుల ప్రవాహంలో ఫుల్ బిజీగా ఉంది. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి మెగాస్టార్ తో ఓ సినిమా చేయాలని కోరిక. ఓ దశలో మెగాస్టార్ 150వ సినిమా పూరి వద్దకే వెళ్ళింది. కానీ కొన్ని కారణాల వల్ల పూరిని పక్కన పెట్టారు చిరు. అయితే చిరంజీవి ప్రస్తుతం చేస్తోన్న `గాడ్ ఫాదర్` కథలో పూరి జగన్నాధ్ మెగాస్టార్ ఇమేజ్ కి తగినట్టుగా కొన్ని మార్పులు సూచించాడు. అవి బాగుండడంతో చిరు కూడా ఆ మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ప్రస్తుతం దర్శకుడు మోహన్ రాజా పూరి జగన్నాధ్ చెప్పిన పాయింట్స్ ఆధారంగా కొత్త సీన్లు రాసుకుంటున్నాడు. సహజంగా పూరి జగన్నాధ్ కమర్షియల్ డైరెక్టర్. ముఖ్యంగా హీరో ఎలివేషన్లు, అలాగే బలమైన సీన్లు బాగా రాస్తాడు. కాబట్టే చిరుకి నచ్చి ఉంటాయి. పైగా తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో కీలకమైన మార్పులను పూరి జగన్నాధ్ చెప్పాడట.
పైగా ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమాల్లోనే ఫుల్ క్రేజ్ ఉన్న సినిమా అంటే గాడ్ ఫాదర్ నే. పక్కా హీరోయిజమ్ తో సాగే సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు. అన్నట్టు ఈ సినిమాలో చాలా పాత్రలను యాడ్ చేశారు. ఆ పాత్రల్లో హీరోయిన్ పాత్ర కూడా ఒకటి.
హీరోయిన్ గా నయనాతర నటించబోతుంది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్ స్వరాలందిస్తుండగా.. నిరవ్ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం చిరు తన లుక్ ను పూర్తిగా మార్చబోతున్నారు.