Nagarjuna: అక్కినేని ఫ్యామిలీలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి సమంత, ఆ కుటుంబానికి బాగా దగ్గరైంది. ముఖ్యంగా నాగార్జునతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. కానీ తాజాగా నాగచైతన్య – సమంత విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ లు చేస్తూ క్లారిటీ ఇచ్చారు. చైతు ట్వీట్ చేస్తూ.. ‘మేం భార్యాభర్తలుగా విడిపోయినా.. ఎప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటామని చెప్పుకొచ్చాడు. అటు సమంత కూడా ఇదే విషయాన్ని చెప్పింది.

అయితే ఇప్పుడు చై – సామ్ విడాకుల పై అక్కినేని నాగార్జున స్పందిస్తూ.. ‘ఎంతో బాధపడుతూ ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. సమంత, చైతు విడిపోవటం నిజంగా ఎంతో దురదృష్టకరం. అయితే, భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వారి వ్యక్తిగతమైన విషయం. కానీ, సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంతతో మా ఫ్యామిలీ గడిపిన ప్రతిక్షణం మాకు ఎంతో మధురమైనది. సమంత మా ఫ్యామిలీకి చాలా దగ్గరైంది. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’ అంటూ నాగార్జున పోస్ట్ చేశారు.
నిజానికి గత కొన్ని రోజులుగా నాగచైతన్య, సమంతలు విడిపోతారని వార్తలు వినిపించినా ఫ్యాన్స్ నమ్మలేదు. కారణం నాగార్జున వారిద్దర్నీ కలుపుతారని నమ్మారు. అందుకు తగ్గట్టుగానే చైతు – సామ్ మధ్య గొడవలని పరిష్కరించడానికి నాగార్జున కూడా గట్టిగానే ప్రయత్నించారు. కానీ చైతుతో పాటు సామ్ కూడా వెనక్కి తగ్గలేదు.
గొడవ పడిన దగ్గర నుంచే.. అంటే, రెండు నెలల క్రితం నుంచే సమంత, చైతు విడివిడిగా ఉంటున్నారు. చైతు – సామ్ ఇప్పటి వరకూ ‘ఏమాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ’ ఇలా నాలుగు చిత్రాల్లో కలిసి నటించారు. ఈ నాలుగు సినిమాల్లో వీరిద్దరూ మొదట అపోహల కారణంగా గొడవపడి విడిపోవడం,
ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మళ్ళీ కలిసిపోవడమే మెయిన్ కథాంశం. కానీ రీల్ లైఫ్ లో లాగే.. రియల్ లైఫ్ లో మాత్రం వీరిద్దరూ మళ్ళీ కలవలేదు.
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2021