Puri Jagannadh: బద్రి సినిమాతో దర్శకుడి గా తన కెరియర్ ను స్టార్ట్ చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్…బద్రి మూవీ ఇచ్చిన సక్సెస్ తో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. వరుసగా సినిమాలను చేస్తూ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరికి ఆయన సక్సెస్ లను అందించాడు. స్టార్ హీరోల అభిమానులకు కూడా పూరి జగన్నాథ్ అంటే రెస్పెక్ట్ పెరిగింది. చాలామంది హీరోల అభిమానులు సైతం అతని ఫ్యాన్స్ గా మారిపోయారు. అలాంటి పూరి జగన్నాథ్ గత కొద్దిరోజుల నుంచి సరైన సక్సెస్ ని సాధించడంలో తడబడుతున్నాడు. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతితో చేస్తున్న ‘స్లమ్ డాగ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా విజయ్ సేతుపతికి అనుకున్న విజయాన్ని సాధించి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఈ సినిమాతో సక్సెస్ వస్తేనే పూరి జగన్నాథ్ కి స్టార్ హీరోల నుంచి అవకాశాలు వచ్చే ఛాన్సులైతే ఉన్నాయి. ఒకవేళ ఈ సినిమా తేడా కొడితే మాత్రం పూరి జగన్నాథ్ షెడ్డు కి వెళ్లి పోవాల్సిందే అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అతను ఇంతకుముందు ఎలాగైతే కసిగా సినిమాలు తీసేవాడో అలాంటి కసి ఇప్పుడు కనిపించడం లేదు.
ఒకవేళ ఆయన మరోసారి అలా ఫోకస్ తో సినిమాలను చేస్తే ఇప్పటికి కూడా సూపర్ సక్సెస్ లను సాధించే అవకాశం ఉంది. నిజానికి అతని కంటే తక్కువ టాలెంట్ ఉన్నవారు సైతం సినిమాలను ఈజీగా సక్సెస్ ఫుల్ గా నిలుపుతున్నారు. పూరి జగన్నాథ్ కేవలం సినిమా మీద ఫోకస్ చేయకపోవడం వల్లే అలా ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు…
ఏది ఏమైనా కూడా పూరి జగన్నాథ్ మరోసారి రాణించాలి అంటే మాత్రం స్లమ్ డాగ్ సినిమాతో తప్పకుండా సూపర్ సక్సెస్ ని సాధించాలి. అది ఏ మాత్రం తేడా కొట్టిన కూడా అతని కెరియర్ అనేది ముగిసిపోవడం పక్కా అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…
