Puri Jagannadh: ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు హిట్, ప్లాప్ పైనే ఆధారపడి ఉంటుంది. ఒక్క భారీ హిట్ పడితే అవకాశాలు క్యూ కడతాయి. అలాగే ప్లాప్ పడితే హీరోలు, నిర్మాతలు ముఖం చాటేస్తారు. పదుల సంఖ్యలో హిట్స్ ఇచ్చిన దర్శకుల ఫేట్ ఒక్క డిజాస్టర్ మార్చేయగలదు. దర్శకుడు పూరి జగన్నాథ్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఫార్మ్ లోకి వచ్చిన పూరి జగన్నాధ్ ని లైగర్ కోలుకోలేని దెబ్బేసింది. ఆయనతో సినిమా చేయాలంటే హీరోలు భయపడే పరిస్థితి తీసుకొచ్చింది. పూరి ఏం మారలేదు. ఒకప్పటి క్రియేటివిటీ ఇప్పుడు లేదు. అదే పాత చింతకాయ పచ్చడి చిత్రాలు చేస్తున్నాడంటూ ప్రేక్షకులు విమర్శిస్తున్నారు.

లైగర్ పై ఆడియన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ మూవీలో మినిమమ్ మేటర్ లేదు. లైగర్ డిజాస్టర్ కావడంతో ఆయన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన ఆగిపోయింది. ప్రస్తుతం పూరికి ఓ హీరో కావాలి. జనగణమన అటకెక్కడంతో కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. లైగర్ హిట్ అయితే పూరి రేంజ్ పూర్తిగా మారిపోయేది.లైగర్ విడుదలకు ముందు బాలీవుడ్ బడా స్టార్స్ సల్మాన్, షారుక్ లు ఆయనతో మూవీ చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ ఇద్దరు స్టార్స్ కి ఆయన కథలు కూడా వినిపించాడు.
సందేహం లేకుండా సల్మాన్, షారుక్ లలో ఎవరో ఒకరు ఆయనకు ఆఫర్ ఇచ్చేవారు. లైగర్ రిజల్ట్ చూశాక అది అసాధ్యం. ఈ క్రమంలో ఆయన బాలయ్యతో సినిమా చేసే ఆస్కారం కలదు. జయాపజయాలతో సంబంధం లేకుండా బాలయ్య స్క్రిప్ట్ నచ్చితే ఓకే చెప్పేస్తాడు. పైసా వసూల్ ఆడకున్నా పూరి అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. పూరికి బాలయ్య ఛాన్స్ ఇచ్చినప్పటికీ ఏడాదికి పైగా ఎదురు చూడాలి. పూరికి వెయిటింగ్ నచ్చదు.

మూడు నెలల్లో మూవీ పూర్తి చేయగల టాలెంట్ ఉన్న పూరి ముందున్న ఒకే ఒక ఆప్షన్ కొడుకు ఆకాష్ పూరీనే అంటున్నారు. టైర్ టూ హీరోలతో పాటు పూరికి వెంటనే అవకాశం ఇచ్చే నాథుడు లేని క్రమంలో పూరి కొడుకుతో మూవీ చేసే ఆలోచన చేయవచ్చు. ఆకాష్ పూరితో మంచి విజయం అందుకొని తానేమిటో నిరూపించుకునే ప్రయత్నం చేయవచ్చు. కాదు అనుకుంటే కొన్నాళ్ళు పూరి ఆగాల్సి ఉంటుంది. ఇక చూడాలి పూరి నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుందో…