Puri Jagannadh And Charmme Kaur: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరీ జగన్నాధ్… గతంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని నెక్స్ట్ లెవెల్ దర్శకుడిగా పేరు సంపాదించి పెట్టినవే కావడం విశేషం… గత రోజుల నుంచి తన పూర్తి ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు. అందుకే స్పెషల్ కేర్ తీసుకొని మరి సినిమాలు చేస్తున్నాడు. వరుసగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి రెండు డిజాస్టర్ సినిమాలతో పూర్తిగా డీలా పడిపోయిన పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి డైరెక్షన్ లో ‘స్లమ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన మరోసారి తనని తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పూరి జగన్నాధ్, ఛార్మి మధ్య బిజినెస్ పరంగా చాలా మంచి డీల్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగానే వీళ్లిద్దరు తమ సినిమాలను నిర్మించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఈ క్రమంలో వరుసగా తీసిన సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో కొంతవరకు నష్టపోయారు.
ఇప్పుడు స్లమ్ డాగ్ మూవీతో మరోసారి సక్సెస్ ని సాధించి భారీ లాభాలను ఆర్జిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా కనక డిజాస్టర్ అయితే మాత్రం పూరి జగన్నాధ్, చార్మి మధ్య విపరీతమైన గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు డబ్బులు నష్టపోయారు. ఇకమీదట కూడా నష్టపోతే వీళ్ళ బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉందని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఇంకా కొంతమంది పూరి జగన్నాధ్ అభిమానులైతే ఛార్మి ని వదిలేసి పూరి జగన్నాధ్ సినిమాలు చేసినప్పుడు మాత్రం అతనికి సక్సెస్ లు వస్తాయని, అప్పటి వరకు ఆయన ఏం చేసినా కూడా అంత ఎఫెక్టివ్ గా సినిమాలు చేయలేకపోతున్నాడనే వార్తలను కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
