Kannada Heroes: కన్నడ సినీ పరిశ్రమలో ముగ్గురు స్టార్ హీరోలు మరణించడం సంచలనంగా మారింది. ముగ్గురి పుట్టిన తేదీలు ఒకటే కావడం, ముగ్గురూ ఒకే సంవత్సరంలో మరణించడంపై అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పార్థివ దేహ దర్శనానికి బారులు తీరుతున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి కంఠీరవ స్టేడియం జనసంద్రంగా మారింది. దీంతో అభిమానుల రాక మాత్రం తగ్గడం లేదు.

రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆదివారం చేపడతామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. రాజ్ కుమార్ హఠాన్మరణం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రాజ్ కుమార్ లేరనే వార్త అందరని కలచివేస్తోంది. ఆయన మృతికి సంతాపంగా షూటింగ్ లు బంద్ చేశారు. థియేటర్లు కూడా మూసి వేశారు. బెంగుళూరు సహా రాష్ర్ట వ్యాప్తంగా సంతాప దినాలుగా ప్రకటించారు.
ఏడాది కాలంలో కన్నడ స్టార్ హీరోలు ముగ్గురు కనుమరుగవడం అందరిని శోకసంద్రంలో ముంచివేస్తోంది. గత ఏడాది చిరంజవి సర్జా ఇలాగే గుండెపోటుకు గురై మరణించారు. ఆయన యాక్షన్ కింగ్ అర్జున్ కు స్వయాన మేనల్లుడు. ప్రముఖ నటి మేఘనా రాజ్ ను వివాహం చేసుకున్నారు. ఇక అదే సంవత్సరం సంచారి విజయ్, ఇప్పుడు రాజ్ కుమార్ ఇలా ముగ్గురు తిరిగిరాని లోకాలకు వెళ్లడం బాధాకరమే.
Also Read: Puneeth Rajkumar: ఎన్టీఆర్ ను చూడగానే కన్నీళ్లు ఆగాక శివరాజ్ ఏం చేశాడంటే?
అయితే ఈ ముగ్గురు పుట్టిన రోజులు మాత్రం ఒక్కటే కావడం గమనార్హం. ముగ్గురివి కూడా 17వ తేదీ నాడే జన్మించారు. దీంతో జ్యోతిష్య శాస్ర్తం ప్రకారం అందరి దృష్టి పెరుగుతోంది. వీరి మృతికి కారణాలేంటనే ఆలోచనలో పడిపోయారు. చిరంజీవి సర్జా కూడా గత ఏడాది జూన్ 7న గుండెపోటుతో అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. మరో హీరో విజయ్ మాత్రం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కరోనా వైరస్ సమయంలో నిరాశ్రయులైన వారికి ఆహారం అందించేందుకు బైక్ పై వెళ్తుండగా ప్రమదానికి గురై చనిపోయారు. ఆయన జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
Also Read: Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా…