https://oktelugu.com/

Puneeth Rajkumar: తెలుగు లోనూ విడుదల కానున్న పునీత్ రాజ్ కుమార్ “జేమ్స్” చిత్రం…

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29 న హఠాన్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషాదం నుంచి కన్నడ ప్రజలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. పునీత్ లేని లోతు కేవలం కర్నాటక ఫిల్మ్ ఇండస్ట్రి కె కాక మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రికి తీరనిది.    తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించిన పునీత్… ఇలా అకస్మాత్తుగా చనిపోవడం నమ్మలేని విషయం. ఈ మేరకు పునీత్ రాజ్ కుమార్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 3, 2021 / 09:51 PM IST
    Follow us on

    Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29 న హఠాన్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషాదం నుంచి కన్నడ ప్రజలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. పునీత్ లేని లోతు కేవలం కర్నాటక ఫిల్మ్ ఇండస్ట్రి కె కాక మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రికి తీరనిది.    తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించిన పునీత్… ఇలా అకస్మాత్తుగా చనిపోవడం నమ్మలేని విషయం.

    ఈ మేరకు పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘జేమ్స్’ను తెలుగులో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి పునీత్ టాకీ పార్ట్ అంతా పూర్తి చేశాడు అని తెలుస్తుంది.  ఒకట్రెండు యాక్షన్ సీక్వెన్స్‌లు మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తి చేశారంట. దీంతో  ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తి చేసి… మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

    కన్నడ లో మాత్రమే కాకుండా వివిధ భాషల్లో సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా  తెలుగులో మాత్రం పెద్ద ఎత్తునే సినిమా విడుదల కానుందని సీన్ ఇవర్గాల్లో చర్చించుకుంటున్నారు. పునీత్ మరణించిన సమయంలో తెలుగు సినీ తారలే కాక రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సామాన్య ప్రజలు కూడా సోషల్ మీడియా ద్వారా వారు ప్రేమను చాటుకున్నారు.