Puneeth Rajkumar james movie Review: నటీనటులు: పునీత్ రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, అను ప్రభాకర్ తదితరులు.
దర్శకుడు: చేతన్ కుమార్
నిర్మాత : కిషోర్ పత్తికొండ
సంగీతం: చరణ్ రాజ్
సినిమాటోగ్రఫీ : స్వామి జె. గౌడ
ఎడిటర్: దీపు ఎస్. కుమార్
కన్నడ సూపర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియా ఆనంద్, ముఖ్య పాత్రలో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఈ రోజు కన్నడ మరియు తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ చూద్దాం.
కథ :
బెంగళూరులో రెండు పెద్ద మాఫియా గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ లో కీలకమైన వ్యక్తి విజయ్ గైక్వాడ్ (శ్రీకాంత్). అయితే, కొన్ని అనుకోని జరిగిన నాటకీయ పరిణామాల మధ్య విజయ్ గైక్వాడ్ లైఫ్ రిస్క్ లోకి వెళ్తుంది. దాంతో తనను తాను కాపాడుకోవడానికి సెక్యూరిటీ గా సంతోష్ (పునీత్ రాజ్ కుమార్)ను నియమించుకుంటాడు. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా సంతోష్ విజయ్ ను, అతని చెల్లెలు(ప్రియా ఆనంద్) ని కిడ్నాప్ చేస్తాడు. అసలు సంతోష్ ఎందుకు కిడ్నాప్ చేశాడు ? ఇంతకీ సంతోష్ “జేమ్స్”గా ఎప్పుడు మారాడు ? అసలు ఈ జేమ్స్ ఎవరు ? అతని కథ ఏమిటి ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
జేమ్స్ తో అఖండమైన విజయాన్ని అందుకున్నాడు దివంగత పునీత్ రాజ్ కుమార్. పునీత్ సినిమా అంటే.. హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తాయి. ముఖ్యంగా కన్నడ నాట థియటర్స్ దగ్గర జన సమూహమే కనబడింది. పైగా మల్టీప్లెక్స్ ల దగ్గర కూడా. పునీత్ చివరి సినిమా కావడంతో జనం పోటెత్తారు. పార్కింగ్ ఏరియా మొత్తం నిండిపోయి.. థియేటర్స్ ముందు ఉన్న రోడ్డు ఇరువైపుల బళ్ళు పెట్టారు అంటేనే అర్ధం చేసుకోవచ్చు.. పునీత్ స్టామినా ఏమిటో.
అందుకే.. జేమ్స్ సినిమాలో ఏముంది ? ఏమి మిస్ అయింది ? లాంటి విశేషణాలు విశ్లేషణల జోలికి ఇప్పుడు వెళ్లడం లేదు. ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పుకుంటే.. పక్కా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పునీత్ మార్క్ మాస్ అదిరిపోయింది. పునీత్ తన నట విశ్వరూపం చూపించాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన సినిమాగా నిలిచింది.
ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బలంగానే ఉన్నాయి. అలాగే కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి.
ప్లస్ పాయింట్స్ :
పునీత్ నటన,
మెయిన్ పాయింట్, కథలోని మలుపులు,
యాక్షన్ సన్నివేశాలు,
సినిమాలో చెప్పిన మెసేజ్,
మైనస్ పాయింట్స్ :
కొంత ఓవర్ డ్రామా.,
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ స్లోగా సాగడం,
సినిమా చూడాలా ? వద్దా ? :
కచ్చితంగా చూడొచ్చు. ముందు చెప్పుకున్నట్టుగానే.. పునీత్ కోసమైనా ఈ చిత్రాన్ని చూడండి.
రేటింగ్ : 3 /5