Project K titled Kalki 2898 AD: ఎన్నో అంచనాల మధ్య ప్రాజెక్ట్ కే టైటిల్ టీజర్ విడుదలైంది. నిమిషానికి పైగా ఉన్న ఈ టీజర్ అంచనాలు అందుకుంది. ప్రభాస్ తో పాటు రెండు కీలక పాత్రలను చూపించారు. విజువల్స్ హాలీవుడ్ చిత్రాలకు తగ్గకుండా ఉన్నాయి. సాంకేతికత, నిర్మాణ విలువలు అబ్బురపరిచాయి. ఇక ప్రభాస్ లుక్ సైతం మెప్పించింది. ప్రాజెక్ట్ కే అంటే కల్కి అని రివీల్ చేశారు. కాబట్టి ప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్రం పేరు కల్కి. కథలో ప్రాజెక్ట్ కే అనే అంశం ఉండటం విశేషం.
టీజర్లో కథపై హింట్ ఇచ్చేశారు. కథ 2898 ADలో మొదలవుతుంది. అంటే నేటి కాలానికి ఐదు వేల సంవత్సరాలకు పూర్వం. దుష్టుల వలన మానవజాతి హింసకు గురవుతున్నప్పుడు, జనాల్లో ఆశలు నశించినప్పుడు కల్కి రంగంలోకి దిగుతాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు. అదే ప్రధాన కథ. అయితే దీన్ని భవిష్యత్-భూత కాలాల మధ్య నడిపినట్లు తెలుస్తుంది.
పీరియాడిక్ స్టోరీతో పాటు భవిష్యత్ కి సంబంధించిన నేపథ్యం కూడా ఉండనుంది. అంటే మోడరన్ వరల్డ్ ఎలా ఉంటుందో చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రభాస్ శత్రువులతో యుద్ధం చేస్తాడు. కల్కి అనే పేరుతోనే మనకు ఒక అవగాహన వస్తుంది. కలిగియుగంలో పాపం పెరిగిపోయినప్పుడు కల్కి అవతరిస్తాడు. దుష్ట సంహారం చేస్తాడు అనేది పురాణం. కాబట్టి హీరో ప్రభాస్ పాత్ర తీరు మనకు అర్థం అవుతుంది.
టీజర్లో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొనెని చూపించారు. ఆమె లుక్ మోడ్రరన్ గా ఉంది. అలాగే తమిళ నటుడు పశుపతి కీలక రోల్ చేశారనిపిస్తుంది. కల్కి టీజర్ అర్ధరాత్రి విడుదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ మేల్కొని మరీ ఈ టీజర్ చూశారు. మొత్తంగా కల్కి టీజర్ అంచనాలు అందుకుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ కొంత మేర మెప్పించాడు. అశ్వినీ దత్ నిర్మించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్, దిశా పటాని నటిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
