Beast 3 Days Collections: తమిళ స్టార్ హీరో ఇళయ తలపతి విజయ్ హీరో గా నటించిన బీస్ట్ చిత్రం ఇటీవలే విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది..విజయ్ లాంటి స్టార్ హీరో తో డార్క్ కామెడీ కాన్సెప్ట్ ఏ మాత్రం వర్క్ అవ్వదు అని ఈ సినిమా తో రుజువు అయ్యింది, కానీ మొదటి రోజు మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ లో మాత్రం దూసుకుపోతుంది అనే చెప్పాలి..తెలుగు , కన్నడ మరియు మలయాళం వంటి భాషలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పూర్తిగా పడిపోయినప్పటికీ తమిళ వెర్షన్ వసూళ్లు మాత్రం KGF సునామి ని తట్టుకొని గట్టిగ నిలబడింది అనే చెప్పాలి..ముఖ్యంగా తమిళనాడు మరియు ఓవర్సీస్ లో ఈ సినిమా వసూళ్లు వచ్చిన టాక్ కి సంబంధం లేకుండా ఉన్నాయి..మూడు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
మొదటి రోజు తమిళ నాడు లో 36 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు ని నెలకొల్పిన ఈ చిత్రం, రెండవ రోజు 15 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసినట్టు తమిళ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..తమిళనాడు లో వరుసగా పండగ సెలవలు రావడం కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిన అంశాలలో ఒక్కటిగా చెప్పవచ్చు..నిన్న తమిళనాడు కి కొత్త సంవత్సరం దినం..అంటే మనకి ఉగాది ఎలాగో వాళ్లకి అలా అన్నమాట..నేడు వాళ్లకి విషు పండగ దినం..ఈ రెండు రోజులు తమిళ వాళ్లకి పెద్ద పండగ దినాలు అని చెప్పొచ్చు..ఆ పండగ దినాలే బీస్ట్ సినిమా పాలిట దేవుడిలా మారింది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఈ సినిమా కి ఇదే స్థాయి వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తుండడం తో ఈ సినిమా వీకెండ్ లోనే దాదాపుగా 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తమిళనాడు ట్రేడ్ సర్కిల్స్ లో గట్టిగ వినిపిస్తుంది..అంటే ఈ సినిమాని కొన్న బయ్యర్లు ఈ మూడు రోజుల్లో దాదాపుగా సేఫ్ అయ్యిపోయినట్టే అని చెప్పొచ్చు.
Also Read: RRR కలెక్షన్స్ పై KGF చాప్టర్ 2 ఎఫెక్ట్.. ఆ ఒక్క ప్రాంతం నుండి భారీ నష్టాలు
విజయ్ కి ఇలా డివైడ్ టాక్ తో అద్భుతమైన వసూళ్లను రాబట్టడం కొత్త ఏమి కాదు..ఆయన గత చిత్రాల్లో ఒక్క సినిమాకి కూడా సరైన టాక్ రాలేదు..కానీ ఫుల్ రన్ లో బాక్స్ ఆఫీస్ వసూళ్ల పరంగా ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..ఇప్పుడు బీస్ట్ కూడా అంటే..ఎదురుగా KGF చాప్టర్ లాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని పెట్టుకొని ఫ్లాప్ టాక్ వచ్చిన ఒక్క సినిమాకి ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి..దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే తమిళనాడు ప్రస్తుతం విజయ్ కి ఉన్న క్రేజ్ మరో హీరో ఎవ్వరికి లేదు అనే విషయం..రజినీకాంత్ మరియు అజిత్ లు విజయ్ కి గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళకంటే మొదటి రోజు రికార్డ్స్ లో కానీ..ఫుల్ రన్ రికార్డ్స్ లో కానీ విజయ్ నాలుగు మెట్లు ముందు ఉన్నాడు అనే చెప్పాలి..మొదటి వారం ఈ సినిమాకి మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తున్నప్పటికీ ఫుల్ రన్ లో కలెక్షన్స్ ఎంత వరుకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
Also Read: రంగం లోకి దిగిన కొరటాల శివ.. సర్కారు వారి పాట లో భారీ మార్పులు