Telugu Industry Players: మూవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా మంది దానిపైనే ఫోకస్ పెడతారు. చాన్స్ లు వచ్చినన్ని రోజులు పూర్తిగా యాక్టింగ్ కోసమే టైం కేటాయిస్తుంటారు చాలా మంది. కానీ ఇండస్ట్రీలోకి రాకముందు వారి కన్న కలలు వేరు.. వారు నడిచిన దారులు వేరు. ఇందులో కొందరు తమకు నచ్చిన ఫీల్డ్‌లో ఎక్స్ పర్ట్స్ కావాలని కలలు కన్న వారున్నారు. మరి కొందరు ప్రొఫెషనల్ ప్లేయర్స్ సైతం ఉండటం విశేషం. నేషనల్ లెవల్ ప్లేయర్స్ సైతం వారిలో ఉన్నారు. మరి వారెవరో తెలుసుకుందామా?
హీరో సుధీర్ బాబు.. ఆయన నేషనల్ లెవల్ బ్యాడ్మింటన్. పెల్లెల గోపీచంద్ తో కలిసి ఆట ఆడాడు. ఇక అవసరాల శ్రీనివాస్ గురించి చెప్పాలంటే ఆయన ఓ రాకెట్ బాల్ ప్లేయర్. 2014 సంవత్సరంలో దక్షిణకొరియాలో నిర్వహించిన ఆసియా ఓపెన్ రాకెట్ బాల్ చాంపియన్‌షిప్‌లోనూ పార్టిసిపెట్ చేశాడు. హీరో నాగశౌర్య.. ఆయన ఓ నేషనల్ లెవల్ టెన్నిస్ ప్లేయర్.. మూవీస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఆయన ఈ ఆట కోసం ఎక్కువ టైం కేటాయించేవాడు.

అక్కినేని నాగచైతన్య కార్ రేసర్… ప్రస్తుతం ఖాళీ దొరికినప్పుడల్లా ఆయన రేసింగ్ చేస్తుంటాడు. ఇక అక్కినేకి అఖిల్ విషయానికి వస్తే.. అతడో ప్రొఫెషనర్ క్రికెట్ ప్లేయర్. క్రికెట్ కోసం ఆస్ట్రేలియాలో స్పెషల్ ట్రైనింగ్ సైతం తీసుకున్నాడు. తరుణ్ రంజీ లెవల్ క్రికెట్ ప్లేయర్.. ఆయనో ఆల్ రౌండర్ కూడా.. మూవీస్ లోకి వచ్చాక అతని ప్రొఫెషన్ మారింది.

Also Read: హీరోయిన్స్ అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. చూస్తే షాక్ అవుతారు..
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఆమె నేషనల్ లెవల్ గోల్ఫ్ ప్లేయర్. ఇండియా తరపున సైతం ఆమె ఆడింది. ఇక రితికా సింగ్ ఓ కిక్ బాక్సర్.. చూశారుగా తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉన్నారో.. వీరు ఇండస్ట్రీలోకి వచ్చాక కొంత మంది వాటిని ఇంకా కొనసాగిస్తుంటే.. మరి కొందరు మాత్రం వాటిని పక్కన పెట్టేసి కేవలం మూవీస్ పైనే కాన్సట్రేట్ చేస్తున్నారు.
