Pushpa 2 : దేశవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ ఫీవర్ ఏ రేంజ్ లో ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. రోజురోజుకి ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లో ఎప్పుడూ చూడని రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి వారం లోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరిన ఈ చిత్రం, రెండు వందల కోట్ల రూపాయిల క్లబ్ లో చేరే దిశగా ముందుకు దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ప్రభావం వల్ల పాపం హీరో నితిన్ కి అన్యాయం జరిగింది. చాలా కాలం నుండి సక్సెస్ లు లేక ఇబ్బంది పడుతున్న నితిన్, ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. గతంలో వెంకీ నితిన్ తో భీష్మ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని తీసాడు.
ఈ సినిమాని ‘పుష్ప 2’ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా చేసారు. అయితే ఈ సినిమా కారణంగా ‘పుష్ప 2’ థియేట్రికల్ రన్ ఆగిపోతుంది. నార్త్ ఇండియా లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసింది. కళ్ళు చెదిరే లాభాలను దక్కించుకుంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి. ఈ వీకెండ్ తో 30 కోట్ల రూపాయిల షేర్ వరకు కవర్ అవ్వొచ్చు. కానీ మిగిలిన 30 కోట్ల రూపాయిల షేర్ రికవర్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. చాలా కష్టమైన టాస్క్. అందుకే ‘పుష్ప 2’ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బయ్యర్స్ నిర్మాతలను కలిశారు.
డిసెంబర్ 25 న విడుదల అవ్వబోతున్న నితిన్ ‘రాబిన్ హుడ్’ చిత్రాన్ని ఆపాల్సిందిగా రిక్వెస్ట్ చేసారు. క్రిస్మస్ నేషనల్ హాలిడే కాబట్టి, ఆరోజు వరకు ‘పుష్ప 2’ కి మన తెలుగులో అత్యధిక థియేటర్స్ ఉంటే బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వెళ్లొచ్చు. ఆ వీకెండ్ మొత్తం మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా న్యూ ఇయర్ వీకెండ్ కూడా కలిసి వస్తుంది. అప్పటికి ఈ చిత్రం పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అనే బలమైన నమ్మకంతో ఉన్నారట మేకర్స్. బయ్యర్స్ ని అర్థం చేసుకున్న నిర్మాతలు నితిన్ ‘రాబిన్ హుడ్’ చిత్రాన్ని వాయిదా వేసారట. నితిన్ కి ఇది నచ్చలేదు. అవసరమైతే నైజాం రైట్స్ నేనే తీసుకుంటాను, విడుదల చెయ్యండి అని నిర్మాతలను నితిన్ బ్రతిమిలాడాడట. కానీ నిర్మాతలు ఒప్పుకోలేదు, నితిన్ కి పరిస్థితి అర్థం అయ్యేలా వివరించి సంక్రాంతికి ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తుంది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Producers who pushed nitin for pushpa 2 no matter how much nitin tried they didnt agree what really happened
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com