https://oktelugu.com/

అయ్యో.. పాపం బాలయ్య.. !

ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోలతో పాటు.. మెగాస్టార్, రజిని లాంటి సీనియర్ స్టార్ల సినిమాలు కూడా వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. కానీ, పాపం బాలయ్య సినిమాలు మాత్రం గత ఐదారు సినిమాల నుండి గట్టిగా పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేని దుస్థితిలోకి వెళ్లిపోతున్నాయంటే.. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య దీనస్థితిని అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇలా వరుసగా డిజాస్టర్లు ఇవ్వడం బాలయ్యకు కొత్తేమి కాదు, ఒకప్పుడు ప్లాప్ […]

Written By:
  • admin
  • , Updated On : August 19, 2020 / 04:51 PM IST
    Follow us on


    ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోలతో పాటు.. మెగాస్టార్, రజిని లాంటి సీనియర్ స్టార్ల సినిమాలు కూడా వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. కానీ, పాపం బాలయ్య సినిమాలు మాత్రం గత ఐదారు సినిమాల నుండి గట్టిగా పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేని దుస్థితిలోకి వెళ్లిపోతున్నాయంటే.. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య దీనస్థితిని అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇలా వరుసగా డిజాస్టర్లు ఇవ్వడం బాలయ్యకు కొత్తేమి కాదు, ఒకప్పుడు ప్లాప్ లకు బాలయ్య పెట్టింది పేరు. ముఖ్యంగా బాలయ్య కెరీర్ లో ‘సింహా’ సినిమాకి ముందు వరకూ బాలయ్యతో సినిమా చేయడానికి నిర్మాతలు భయపడేవాళ్ళు. ఇప్పుడు బాలయ్య మళ్లీ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. బాలయ్య బాబు తర్వాత సినిమాకి నిర్మాత దొరడం లేదు. నిర్మాతలు మళ్లీ బాలయ్యను చూసి భయపడుతున్నారు.

    Also Read: సాంగ్స్ కోసం ‘పుష్ప’ను సిద్ధం చేస్తున్నారు !

    బోయపాటి సినిమా తర్వాత బాలయ్య తన తరువాత సినిమాని, సీనియర్ దర్శకుడు బి గోపాల్ తో చేస్తున్నాడు. నిజానికి బాలయ్య కెరీర్ లోని సూపర్ హిట్ చిత్రాలు ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ సినిమాలతోనే బాలయ్య మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. కానీ ఇప్పుడు అదే డైరెక్టర్ తో బాలయ్య మళ్ళీ సినిమా చేస్తానంటే మాత్రం నిర్మాతలు ఎవ్వరూ నమ్మడం లేదు. ఇప్పుడు ఈ కాంబినేషన్ వర్కౌట్ అవ్వదు అనేది నిర్మాతల అభిప్రాయం. ఎందుకంటే.. గోపాల్ హిట్ ట్రాక్ నుండి ఎప్పుడో సైడ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయాడనేది నిజం. అయినా బాలయ్య మాత్రం మరోసారి బి.గోపాల్ తోనే సినిమా చేయాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు.

    Also Read: తెలుగు స్టార్ పై బాలీవుడ్ హీరోల టెన్షన్ !

    ఆ మధ్య ఓ ఫంక్షన్ లో గోపాల్, బాలయ్యకు కనిపించాడట. అప్పుడు ఆ ఉత్సాహంలో బాలయ్య గోపాల్ తో కలిసి ఒక సినిమా చేద్దామని అభయం ఇచ్చాడట. ఇక అప్పటినుండి ఏ నిర్మాత వచ్చినా బి గోపాలే మన డైరెక్టర్ అని చెప్పడంతో.. ఒక్కో నిర్మాత సైలెంట్ గా బాలయ్యకి దూరం జరుగుతున్నారని టాక్. పాపం బాలయ్య ఇంతే.. మాట ఇస్తే.. బిజినెస్ చూసుకోడు. మనోడు అనే ఫీలింగ్ ఉంటే.. ఇక హిట్ కాంబినేషన్ లు అనే కండిషన్ లు కూడా బాలయ్య పట్టించుకోడు. ఏమైనా బాలయ్య.. బాలయ్యే.