Vishwa Prasad Speech: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం వచ్చే నెల 9న సంక్రాంతి కానుకగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే చాలా వరకు బయటకు వచ్చేసింది. కానీ ఒక్కటి కూడా సినిమా పై హైప్ పెంచేందుకు ఉపయోగపడలేదు. అభిమానులంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ మీదనే ఆశలు పెట్టుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కుకట్ పల్లి ప్రాంతం మొత్తం నిన్న జై రెబల్ స్టార్ నినాదాలతో హోరెత్తిపోయింది. ఈ ఈవెంట్ లో ప్రభాస్ అందరూ ఆశ్చర్యపోయేలా, అభిమానులను హుషారు పరిచేలా మాట్లాడడం గమనార్హం. ఇలా ఆయన మాట్లాడి చాలా రోజులైంది. ఇకపోతే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన విశ్వ ప్రసాద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి చాలా కాలం తర్వాత ఒక పెద్ద సినిమా, బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తో ‘రాజా సాబ్’ రాబోతుంది. చాలా మంది దీనిని చాలా చిన్న సినిమా, కొద్దీ రోజుల్లోనే , తక్కువ బడ్జెట్ లో అయిపోతుందని అనుకున్నారు. కానీ ఇది చాలా పెద్ద సినిమా. మూడేళ్లు ఎంతో కస్టపడి పని చేసాము. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే ఇంత పెద్ద క్యాన్వాస్ తో ఒక హారర్ సినిమా రాలేదు. కచ్చితంగా ఈ చిత్రాన్ని చూసి మీరు థ్రిల్ ఫీల్ అవుతారు’ అంటూ చెప్పుకొచ్చాడు విశ్వప్రసాద్. ఇకపోతే రేపు ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్టు ప్రభాస్ చెప్పుకుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘రేపు ట్రైలర్ రాబోతుంది అట. మా మారుతీ పిచ్చి, మా నిర్మాత విశ్వప్రసాద్ గారి కష్టం అన్నీ రేపు ట్రైలర్ లో కనిపిస్తాయి’ అంటూ చెప్పుకుకొచ్చాడు.
సినిమాకు తన డ్యూటీ మొత్తం పూర్తి అయ్యిందని , ఇప్పుడు రీ రికార్డింగ్ కోసం తమన్ చేతిలో పెట్టామని, ఆయన ఎంత గట్టిగా కొడితే , ఈ సినిమా అంత గట్టిగా బాక్స్ ఆఫీస్ వద్ద కొడుతుంది అంటూ మారుతీ చెప్పుకొచ్చాడు. అయితే మారుతి ప్రభాస్ గురించి మాట్లాడుతున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాడు. నా మొదటి సినిమాకు కూడా ఎప్పుడూ ఇలా ఏడవలేదు, అంత అద్భుతంగా వచ్చింది ఈ సినిమా అంటూ చెప్పుకుకొచ్చాడు. అంతా బాగానే ఉంది కానీ, మారుతీ మాట్లాడిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రాజమౌళి ఒక మీడియం రేంజ్ హీరో ని పెట్టి, ‘బాహుబలి ‘ లాంటి సినిమాని తీసి, నేడు ఇండియా కి ఒక భారీ కటౌట్ ని అందించాడు అంటూ చెప్పుకొచ్చాడు. దీనిని సోషల్ మీడియా లో అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ, బాహుబలి కి ముందు ప్రభాస్ చిన్న హీరో అని వాళ్ళ డైరెక్టర్ కూడా ఒప్పుకున్నాడు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.