Producer Reveals Shocking Facts About Samantha: ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు వార్తలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఒకటి ‘మా’ ఎన్నికలు కాగా, రెండోది నాగ చైతన్య – సమంత విడాకులు. ఈ రెండు విషయాలపై ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో నిత్యం ఎవరో ఒకరు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా సమంత – నాగ చైతన్య విడాకుల విషయంపై ప్రముఖ దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ పుత్రిక నీలిమ గుణశేఖర్ సమంత గురించి కొన్ని విషయాలు ఈరోజు బయటపెట్టింది. తాను చైతన్య – సమంత విడిపోవడం గురించి విని షాక్ గురయ్యానని తెలిపింది. సమంత నటిస్తున్న శాకుంతలం చిత్రానికి నీలిమ గుణశేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

నీలిమ.. శాకుంతలం సినిమాలో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేసి సమంతను కలిసి పీరియాడిక్ సినిమా కథ ఉందని, ఆ కథకు నువ్వే సెట్ అవుతావు అని చెప్పిందంట. దానికి సమంత తాను 2021 సెంకడ్ హాఫ్ లో ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నాను అని, అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోవట్లే అని చెప్పిందంట. కానీ కథ నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పి, త్వరగా సినిమాను పూర్తి చేయాలనీ కోరిందంట. తనకి పిల్లలు అంటే చాల ఇష్టం అని, ఆ ప్రక్రియలోనే ఉన్నానని తెలిపి, ఈ సినిమానే తన చివరి సినిమా కావొచ్చని, ఈ సినిమా అనంతరం చాల గ్యాప్ తీసుకుంటాను అని నీలిమతో సమంత చెప్పిందంటా.
ఇందుకు నీలిమ పీరియాడిక్ సినిమా కనుక ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, కానీ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేస్తామని మాటిచ్చాకే సమంత శాకుంతలం సినిమాలో నటించేందుకు ఒప్పుకుందంట. అందుకు సమంత జూలై, ఆగస్ట్‌లోకెల్లా షూటింగ్ పూర్తిచేయాలని కోరగా అలానే చేస్తామని మాటిచ్చాం’ అని నీలిమ గుణ నిన్న జాతీయ మీడియాతో చెప్పుకొచ్చింది. ఇవన్నీ చూస్తే మాధవీలత చెప్పినట్టుగా అక్కినేని ఫ్యామిలీయే ఏదైనా చేసి ఉంటుందా ?, వారే ఆమె కలలను చెరిపేశారా? అనే అనుమానాలు సమంత అభిమానులకి మొదలవుతున్నాయి. మొత్తానికి ఈ విడాకుల వెనుకున్న రహస్యాలు మాత్రం ఎప్పుడు బయటకు వస్తాయో ఏమో.