లేడీ సూపర్ స్టార్ నయనతార వ్యవహారం ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఆమెది అంతా డిఫరెంట్ స్టైల్. సినిమాను బట్టి, అలాగే దర్శకనిర్మాతలను బట్టి అన్నిటికి మించి ఆ సమయంలో తనకున్న అవసరాలను బట్టి తన పారితోషికాన్ని ఫిక్స్ చేసుకుంటుంది నయనతార. అందుకే తరుచూ నయనతార తన రెమ్యునరేషన్ ను మారుస్తూ ఉంటుంది. ఈ విషయం తెలియని ఓ నిర్మాత తన సినిమాలో నటించమంటూ ఆ మధ్య నయనతారను అప్రోచ్ అయ్యాడు.
అప్పుడు సినిమాకి గానూ 4 కోట్లు వరకూ అడిగిన నయన్ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఏకంగా ఏడు కోట్లు వరకూ తన పారితోషికాన్ని కోట్ చేసిందట. అదేంటి అని అడిగితే.. సమాధానం కూడా చెప్పలేదట. కానీ నయనతార గురించి తెలిసిన మరో నిర్మాత ఆమె గురించి మొత్తం వివరంగా చెప్పుకొచ్చాడట. ఆఖరికి ఆ నిర్మాత అంత ఇచ్చుకోలేను అంటూ అయిదు కోట్ల వరకు ఆఫర్ చేసారట.
కానీ నయనతార ఎలాంటి మొహమాటం లేకుండా నో అనేసింది. పోనీ ఆరు కోట్లు వరకూ ఇద్దామనే ఆలోచన కూడా చేశాడట ఆ నిర్మాత. అయినా నయన్ నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. దాంతో కాస్త అటు ఇటుగా ఏమన్నా ఓకే అంటుందేమో అన్న ఆశతో ఉన్న ఆ నిర్మాత.. చివరకూ ఆమె అడిగినంత ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాడు. ఇంతకీ ఆ నిర్మాత ఎందుకు నయనతార కోసం అంత తాపత్రయ పడుతున్నాడు అంటే..
అతను ఓ సీనియర్ హీరోతో ఓ సినిమాని సెట్ చేసుకున్నాడు. సదురు హీరోగారు నయనతార హీరోయిన్ గా ఉండాలి అని కండిషన్ పెట్టారు. దాంతో ఆ నిర్మాత తప్పక, ఇలా నయనతార చుట్టూ తిరుగుతున్నాడు. మరి నయనతార ఆ నిర్మాతను కరుణిస్తోందో లేదో చూడాలి. ఇంతకీ ఆ సీనియర్ హీరో ఎవరు అంటే.. ఆయన టీజర్ ఈ మధ్య బాగా వైరల్ అయింది.