Producer Ravi: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు… వాళ్లతో సినిమాలు చేస్తే సక్సెస్ లను సాధిస్తాయని అటు దర్శక నిర్మాతలు సైతం భావిస్తారు. ఇక ప్రేక్షకులు సైతం స్టార్ హీరోల సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే వాళ్ల సినిమాలు చాలా గ్రాండియర్ గా ఉంటాయి. విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ సినిమాలను చూస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం స్టార్ హీరోలతో యంగ్ హీరోలు కూడా పోటీపడుతున్నారు. ఇప్పటికే కిరణ్ అబ్బవరం లాంటి నటుడు వరుస గా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. గత సంవత్సరం ‘క’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ప్రస్తుతం ‘కె ర్యాంప్ ‘ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.
రీసెంట్ గా ఆయన ఒక పోడ్ కాస్ట్ లో పాల్గొన్నప్పుడు తమిళ్ హీరో అయిన ప్రదీప్ రంగనాథన్ సినిమాలకు తెలుగులో భారీ ఎత్తున థియేటర్లైతే దొరుకుతున్నాయి. కానీ తెలుగు హీరోలకి తమిళంలో థియేటర్లను ఇవ్వడం లేదు అంటూ కొన్ని కాంట్రవర్షల్ కామెంట్స్ చేశాడు…దాంతో రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ హీరోగా డ్యూడ్ అనే సినిమా చేశాడు. ఆ ట్రైలర్ ఈవెంట్లో భాగంగా ప్రదీప్ రంగనాథన్ ను రిపోర్టర్లు ఈ క్వశ్చన్ అయితే అడిగారు.
దానికి ప్రొడ్యూసర్ అయిన రవి మాట్లాడుతూ సినిమా కంటెంట్ లో దమ్ముంటే థియేటర్లు దొరుకుతాయి…ఒక ప్రేక్షకుడు సినిమాను చూసి అది అతనికి నచ్చితే బాగుందని ఇంకో నలుగురికి చెబుతాడు. బాగాలేకపోతే ఎవరైనా ఏమి చెప్పలేరు కదా! కంటెంట్ బాగుంటే థియేటర్లు దొరుకుతాయి. సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తాయని ఆయన చెప్పిన మాటలు చూసిన వాళ్ళు కిరణ్ అబ్బవరం కి ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మరి కొంతమంది మాత్రం రవి మాట్లాడిన దాంట్లో చాలా వరకు వాస్తవం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే సినిమా బావుంటే ప్రేక్షకులు చూస్తారు లేకపోతే చూడరు అనేది క్లారిటీ గా చెప్పాడు…ఇక రవి మాట్లాడిన మాటలకి కిరణ్ అబ్బవరం ఏదైనా కౌంటర్ ఇస్తాడా? లేదంటే ఈ ఎంటైర్ విషయం మీద ఇంకెవరైనా స్పందిస్తారా అనేది తెలియాల్సి ఉంది…