Hari Hara Veeramallu Movie Updat
Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్(Deputy cm Pawan Kalyan) కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramalli). నిర్మాత ఏఎంరత్నం ఖర్చుకి ఎక్కడా కూడా వెనకాడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. డైరెక్టర్ క్రిష్(director krish) ఈ చిత్రాన్ని వదిలి వెళ్లిపోవడంతో మధ్యలోనే సినిమా ఆగిపోతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు ఏఎం రత్నం. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్, రీ రికార్డింగ్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. సెకండ్ హాఫ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఈ సినిమా మార్చి 28న విడుదల కావడం దాదాపుగా అసాధ్యమేనని, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన నాలుగు రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందని, ఆయన డేట్స్ ఎప్పుడు ఇస్తాడో అర్థం కానీ పరిస్థితి ఉందంటూ అనేక రకాల కామెంట్స్ వినిపించాయి.
ఈ కామెంట్స్ పై ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం మరోసారి అభిమానులకు మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్టుగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది అంటూ వస్తున్న వార్తలను అసలు నమ్మొద్దు. అభిమానులు వాటిని నమ్మి ఆందోళన చెందొద్దు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం మార్చి 28 ని టార్గెట్ చేసుకొనే పూర్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ ని కూడా చేస్తున్నాం. ఎట్టిపరిస్థితిలోనూ మార్చి 28 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అంటూ ఖరారు చేసారు. దీంతో వాయిదా పడింది అంటూ డీలా పడిన అభిమానులందరూ ఒక్కసారిగా మళ్ళీ జోష్ ని నింపుకున్నారు. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవ్వబోతుంది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలోని రెండవ లిరికల్ వీడియో సాంగ్ ‘కొల్లగొట్టినాదిరో’ పాటని ఈనెల 24 వ తేదీన విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి ‘మాట వినాలి’ పాటను విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ నుండి, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ పాటని ఆలపించాడు. 24 న విడుదల అవ్వబోతున్న పాట, సినిమా గ్రాండియర్ ని, పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ ని చూపించనున్నాడు. హీరోయిన్ పక్కన పవన్ కళ్యాణ్ డ్యూయెట్ అనేది జరిగి చాలా కాలం అయ్యింది. మరో రెండు రోజుల్లో ఈ పాటకు సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే యూట్యూబ్ లో ఫ్యాన్ మెడ్ ఎడిట్స్ లో లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఇక ఒరిజినల్ ప్రోమో విడుదలైతే ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి.