Pushpa 2 Pre Release event: డిసెంబర్ 5న పుష్ప 2 వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఒక రోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శన ఉంటుందని సమాచారం. పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా భారీ ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించారు. పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన నిర్మాతలు… ముంబై, చెన్నై, కొచ్చిన్ నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ చేశారు. ఫైనల్ గా పుష్ప 2 చివరి ప్రీ రిలీజ్ వేడుకకు హైదరాబాద్ వేదిక అయ్యింది. లక్షల మంది పాల్గొన్నారు. అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల, సుకుమార్, దేవిశ్రీ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ పాల్గొన్నారు.
రాజమౌళి, అల్లు అరవింద్ తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ… నేను వారం రోజుల క్రితం పుష్ప 2 మూవీ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇంటికి వెళితే చాలా కాలం తర్వాత మీ ముఖం వెలిగిపోతుంది అంది. రెండే సార్లు నాకు ఆ అనుభూతి కలిగింది. ఒకటి మగధీర విడుదలకు ముందు, రెండు పుష్ప 2 విడుదలకు ముందు. అసలు తబిత,స్నేహలకు(సుకుమార్, అల్లు అర్జున్ భార్యలు)అవార్డ్స్, అప్రిసియేషన్స్ దక్కాలి.
ఎందుకంటే ఐదేళ్ల పాటు ఈ పాజిటివ్ పిచ్చోళ్లను అలా వదిలేశారు. రష్మిక మా హీరోయిన్. గీత గోవిందంలో ఆమెను పరిచయం చేశాము. అప్పుడే తన టాలెంట్ చూపించింది. పుష్ప లో ఆమె నటన నథింగ్.. పుష్ప 2 లో చూస్తారు. ఇక శ్రీలీల సినిమాలో కనిపించేది 7-10 నిమిషాలే అయినా.. మామూలుగా ఉండదు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. అందరికీ ధన్యవాదాలు అని ముగించారు.
అల్లు అరవింద్ కామెంట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయి. ఓపెనింగ్ డే రోజు పుష్ప 2 పలు రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లో విపరీతమైన రెస్పాన్స్ దక్కుతుంది.