PRO System Film Industry: పీఆర్వో వ్యవస్థ.. సినిమా ఇండస్ట్రీని పట్టిపీడిస్తోంది.. నిర్మాతలను ఊపిరాడకుండా చేస్తోంది.. సినిమా ప్రమోషన్ల పేరిట లక్షలు వసూలు చేసి.. దానికి తగ్గట్టుగా ప్రమోషన్ చేయలేక.. తూతూ మంత్రంగా ప్రచారం చేసి అందిన కాడికి దోచేసుకుంటోందన్న ఆరోపణలున్నాయి.. సినీ ఇండస్ట్రీలో ఇది అందరికీ తెలిసిన సత్యమే.. కానీ ఎవరూ నోరు మెదపరు.. ఎందుకంటే టార్గెట్ చేస్తారు. నోరు తెరిచినోడిని ఇండస్ట్రీలో బతకనీయరు. వాళ్ల సినిమాలను తొక్కేస్తారు. పీఆర్వోలను దగ్గరి నుంచి చూసి దర్శక ధీరుడు రాజమౌళి ఇలా డబ్బులను వారికి పంచిపెట్టకుండా తనే సొంతంగా ప్రమోషన్స్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అదే మేలు. మిగతా నిర్మాతలు, హీరోలు కూడా ఈ బాట పడితేనే సినీ ఇంండస్ట్రీని పట్టిపీడిస్తోన్న ఈ పీఆర్వోల వ్యవస్థ వల్లే అంత అవుతుంది.
Also Read: అల్లు అర్జున్ ను ఇప్పటికైనా వదిలేయండి!
సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు ప్రేక్షకుల దరికి చేరడం లేదు.. అందులో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను అలరిస్తుంటే మరికొన్ని సినిమాలు మాత్రం డీలా పడిపోతున్నాయి. కారణం ఏంటంటే పీఆర్వోలు సినిమాను జనాల్లోకి మీడియా వద్దకు తీసుకెళ్లడం లేదు. సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాల్సిన కొంతమంది పిఆర్వో లు తీరని నష్టాన్ని చేకూరుస్తున్నారు అనే విమర్శలున్నాయి… సినిమాని సరైన విధంగా ప్రమోట్ చేయకపోవడం వల్ల కొన్ని సినిమాలు సక్సెస్ అవ్వకుండా పోతున్నాయి.
మరికొన్ని సినిమాలను మితిమీరిన ప్రమోషన్స్ తో ట్రోల్ అయ్యే విధంగా ప్రమోట్ చేస్తున్నారు.. అలాగే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లోయన్సర్ తో సైతం వాళ్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇద్దరు పిఆర్వోలు పెద్ద సినిమాలను చేస్తూనే వాళ్ళ ఆటిట్యూడ్ ను చూపిస్తున్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్లకి అనుకూలంగా ఉండకపోతే బెదిరింపులకు కూడా వీరు పాల్పడుతన్నట్టుగా తెలుస్తోంది. నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన వారి మీద పడిపోతున్నారు. సినిమాలోపాలు ఎత్తి చూపితే ఫైర్ అవతున్నారు. నిజానికి పిఆర్వోలు చేసే అతి తగ్గించుకుంటే సినిమాలకు చాలావరకు మంచి జరుగుతుందని వాళ్ల వల్లే సగం సినిమా పోతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికైనా పీఆర్వోలు తమ దురుసు వైఖరిని తగ్గించుకుంటే సినిమాకి మేలు జరుగుతోంది. లేకపోతే సినిమా మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడుతోంది. ఇక హీరోల ఫ్యాన్స్ కి సైతం పీఆర్వోలు చుక్కలు చూపిస్తున్నారు. తమ హీరో సినిమాకి టికెట్స్ కావాలంటే చాలు పీఆర్వో లు వాళ్లను బెదిరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానివల్ల హీరోల అభిమానులు సైతం పీఆర్వో లను పక్కన పెడుతున్న పరిస్థితి నెలకొంది..
ఇక ఇప్పటికైనా వీళ్ళ అతి తగ్గించి సినిమాలను బతికించే ప్రయత్నం చేస్తే మంచిది. లేకపోతే మాత్రం మంచి సినిమాల మీద కూడా విమర్శలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి… చూడాలి మరి ఇక మీదటైన వాళ్ల వైఖరి మారుతుందా లేదా అనేది…