Homeఎంటర్టైన్మెంట్Priyanka Nalkari: మలేషియాలో రహస్యంగా పెళ్లి చేసుకొని షాకిచ్చిన నటి

Priyanka Nalkari: మలేషియాలో రహస్యంగా పెళ్లి చేసుకొని షాకిచ్చిన నటి

Priyanka Nalkari
Priyanka Nalkari

Priyanka Nalkari: రంగుల ప్రపంచంలా కనిపించే సినిమా రంగంలో ప్రేమ పెళ్లిళ్లు కామన్. నాటి నుంచి నేటి వరకు చాలా మంది నటీమణులు పెద్దలను కాదని వివాహం చేసుకున్నారు. కొందరు ప్రేమలో పడ్డ నాటి నుంచి అభిమానులకు చెబుతూ పెళ్లి వరకు సందడి చేసేవారు. కానీ ఓ నటి ఎవరికీ చెప్పకుండా మరొకరితో జీవితాన్ని పంచుకోవడానికి రెడీ అయింది. ఏకంగా మలేషియాలో ప్రియుడితో తాళి కట్టించుకొని షాకిచ్చింది. తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ప్రియాంక నల్కారి.. ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు.. కానీ ఆమె నటించిన సినిమాలు చెబితే గుర్తుకు వస్తుంది. బుల్లితెర నటిగా పాపులారిటీ సాధించిన ప్రియాంక 2010లో ‘అందరి బంధువయా’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తరువాత తెలుగులో అవకాశాలు రాకపోవంతో తమిళంలో అడుగుపెట్టింది. ఇక్కడ ఆమెకు ‘సంథింగ్ సంథింగ్’, ‘కాంచన’ సినిమాల్లో కనిపించింది. అయితే తెలుగులో ఆమె కనిపించకపోయినా తమిళంలో మాత్రం బిజీ నటిగా మారింది.

Priyanka Nalkari
Priyanka Nalkari

ప్రియాంక సినిమాల్లో నటిస్తూనే వ్యాపారవేత్త రాహుల్ వర్మ తో ప్రేమలో పడింది. ఈయన పలు తెలుగు సీరియళ్లలో నటించారు. ఈ క్రమంలో ఆయనతో ప్రియాంక సన్నిహితం పెరిగి ఒక్కటయ్యారు. అయితే కొంతకాలం వీరు ప్రేమించుకున్న తరువాత 2018లో సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తరువాత పెద్దలకు తెలిసినా వారు పెద్దగా పట్టించుకోనట్లు తెలిసింది. దీంతో పలు కారణాల వల్ల వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చారు.

తాజాగా ప్రియాంక నల్కారి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో #JustMarried అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసింది. ఆమె పోస్టు చేసిన ఫొటోలను భట్టి చూస్తే వీరిద్దరు మలేషియాలోని ఓ ఆలయంలో మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లిలో తమ కుటుంబ సభ్యులెవరూ లేకపోవడం గమనార్హం. అయితే ఇంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి? అని కొందరు ప్రశ్నించగా ప్రియాంక మాత్రం రిప్లై ఇవ్వడం లేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version