Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్: కెప్టెన్ అయ్యే ఛాన్స్ మిస్, పిచ్చిపట్టినట్లు అరిచిన అమర్, కెప్టెన్సీ టాస్క్ లో విన్నర్ ఎవరంటే?

కెప్టెన్సీ కంటెండర్స్ సేకరించిన బ్రిక్స్ తో వీలైనంత పొడవుగా టవర్ నిర్మించాలని చెప్పారు. మిగిలిన ఇంటి సభ్యులు ఎవరిని అయితే కెప్టెన్ కాకూడదని కోరుకుంటున్నారో వారి టవర్ ని బాల్స్ తో కొట్టి కూల్చే ప్రయత్నం చేయవలసి ఉంటుంది అని బిగ్ బాస్ తెలిపారు.

Written By: NARESH, Updated On : November 18, 2023 12:00 pm
Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా మొదటి లెవెల్లో బ్రిక్స్ సేకరించాలని టాస్క్ ఇచ్చారు. ఇందులో అందరికంటే ఎక్కువ బ్రిక్స్ సేకరించిన వారు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారని బిగ్ బాస్ తెలిపారు. కాగా తాజాగా విడుదలైన ప్రోమోలో ఫైనల్ లెవెల్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. అయితే ఇందులో ఫస్ట్ రౌండ్ లో ఎక్కువ బ్రిక్స్ సేకరించి .. అర్జున్, ప్రియాంక, ప్రశాంత్, అమర్ దీప్ లు కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు.

అయితే కెప్టెన్సీ కంటెండర్స్ సేకరించిన బ్రిక్స్ తో వీలైనంత పొడవుగా టవర్ నిర్మించాలని చెప్పారు. మిగిలిన ఇంటి సభ్యులు ఎవరిని అయితే కెప్టెన్ కాకూడదని కోరుకుంటున్నారో వారి టవర్ ని బాల్స్ తో కొట్టి కూల్చే ప్రయత్నం చేయవలసి ఉంటుంది అని బిగ్ బాస్ తెలిపారు. దీనికి యావర్ సంచాలక్ వ్యవహరించాడు. ఇక నలుగురు కంటెండర్స్ వాళ్ళ దగ్గర ఉన్న బ్రిక్స్ తో టవర్ కట్టారు.

కాగా కంటెండర్స్ టవర్ కట్టడం పూర్తవడంతో .. మిగిలిన ఇంటి సభ్యులు వాటిని పడగొట్టే పనిలో పడ్డారు. ప్రశాంత్ ఇంకా అర్జున్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి ఎక్కువగా వాళ్లనే టార్గెట్ చేశారు హౌస్ మేట్స్. దీంతో మొదట ప్రశాంత్ టవర్ లో తక్కువ బ్రిక్స్ ఉండటంతో అందరికంటే ముందు గేమ్ నుంచి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రౌండ్ లో అర్జున్ రేస్ నుంచి తప్పుకున్నాడు.

చివరికి ప్రియాంక, అమర్ దీప్ కెప్టెన్సీ రేస్ లో కొనసాగుతున్నారు. అయితే గౌతమ్, అర్జున్ .. అమర్ ని టార్గెట్ చేస్తూ టవర్ పడగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో అమర్ కి తిక్కరేగింది.. కోపంతో ఊగిపోయాడు. రండ్రా .. చూసుకుందాం అంటూ టాస్క్ లో విజృంభించాడు అమర్ దీప్ . పక్కనే ఉన్న శోభా ‘ ఆడు అంతే ఆడు’ అంటూ ఎంకరేజ్ చేసింది.

ప్రియాంక బిగ్ బాస్ హౌస్ కొత్త కెప్టెన్ గా అవతరించింది. శివాజీ కెప్టెన్సీ బ్యాడ్జ్ ప్రియాంకకు అప్పగించాడు. శోభ అనంతరం లేడీ కెప్టెన్ గా ప్రియాంక సత్తా చాటింది. మరి ఆమె కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలి. శోభ కెప్టెన్సీ తేలిపోయింది.