Priyanka Chopra Vs Rakul Preet Singh: మన టాలీవుడ్ లో తారాజువ్వ లాగా దూసుకెళ్లి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). ఈమధ్య కాలంలో ఈమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. హిందీ లో కూడా అడపాదడపా రెండు మూడు సినిమాల్లో కనిపించింది కానీ, అవి సక్సెస్ కూడా కాలేదు. అయితే ఇప్పటి వరకు ఆమె క్యూట్ మరియు సాఫ్ట్ రోల్స్ లో నటించడమే మనం చూసాము. ఛాలెంజింగ్ రోల్స్ లో నటించడం ఇప్పటి వరకు చూడలేదు. ఎలాగో హీరోయిన్ రోల్స్ ఈమధ్య కాలంలో రావడం లేదు కాబట్టి, ఇక క్యారక్టర్ రోల్స్ చేసేందుకు సిద్ధమైంది. రకుల్ ప్రీత్ సింగ్ ని నెగెటివ్ రోల్స్ లో ఊహించుకోవడం కాస్త కష్టమే. కానీ ఆమె పూర్తి స్థాయి విలన్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమైందని తెలుస్తుంది. నితీష్ తివారి(Nitish Tiwari) దర్శకత్వం లో బాలీవుడ్ ‘రామాయణం'(Ramayanam) అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో రాముడిగా రణబీర్ కపూర్(Ranbir Kapoor), రావణాసురిడిగా యాష్(Rocking Star Yash), సీతగా సాయి పల్లవి(Sai Pallavi), మండోదరి గా కాజల్ అగర్వాల్(Kajal Agarwal),హనుమాన్ గా సన్నీ డియోల్(Sunny Deol), సూర్పనక్క గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. సూర్పనక్క క్యారక్టర్ చేయడానికి పెద్ద స్థాయికి వెళ్లిన ఏ స్టార్ హీరోయిన్ కూడా ఒప్పుకోవడం కష్టం. ఎందుకంటే లక్ష్మణుడు సూర్పనక్క ముక్కు, చెవులను కోసేస్తాడు. అందవికారం గా మార్చేస్తాడు. పైగా రకుల్ ప్రీత్ సింగ్ ముక్కు కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇలాంటి పాత్ర చేయడానికి చాలా డేర్ ఉండాలి. అయితే రకుల్ ఈ పాత్ర ఒప్పుకోడానికి ఒక ప్రధాన కారణం ఉందట. ఎందుకంటే ఈ క్యారక్టర్ ని ముందుగా గ్లోబల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక చోప్రా(Priyanka Chopra) తో చేయించాలని అనుకున్నారట. ఆమెని సంప్రదించారట కూడా.
ఆమె చేయడానికి సిద్దమే కానీ,డేట్స్ క్లాష్ వచ్చిందట. ఆ కారణం చేతనే ఈ సినిమాని రిజెక్ట్ చేసింది. ప్రియాంక చోప్రా లాంటి సూపర్ స్టార్ యే ఈ పాత్ర చేయడానికి ఇష్టపడింది అనే విషయాన్ని తెలుసుకున్న రకుల్, ఆమెనే ఆసక్తి చూపించినప్పుడు తానూ చేయడం లో తప్పు లేదని భావించి చేసిందట. పైగా రామాయణం ని మలుపు తిప్పే పాత్ర ఇది. ఈమె కారణం గానే రామ, రావణ యుద్ధం జరిగింది. ధర్మ సంస్థాపనకి పరోక్షంగా కారణమైంది. అలాంటి పాత్ర కాబట్టే అంగీకరించిందని అంటున్నారు. కానీ రకుల్ ఫ్యాన్స్ విడుదల తర్వాత ఎలా తీసుకుంటారో చూడాలి. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండవ భాగం 2027 దీపావళి కి వస్తుందట. వాల్మీకీ రాసిన రామాయణం ఆధారంగానే ఈ చిత్రాన్ని తీస్తున్నట్టు తెలుస్తుంది.