https://oktelugu.com/

భర్తను కారులో నుండి తోసేసిన ప్రియాంక చోప్రా !

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నడిరోడ్డులో భర్త నిక్ జోనాస్ ని కారులోనుండి తోసేసింది. అందరూ చూస్తుండగా జరిగిన ఈ సంఘటన షాక్ గురిచేసింది. బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్లిన ప్రియాంక క్వాంటికో సిరీస్ లో నటించారు. ఆ సిరీస్ ద్వారా మంచి పేరుతెచ్చుకున్న ఈ నటి, హాలీవుడ్ లో కొన్ని యాక్షన్ చిత్రాలలో నటించడం జరిగింది. 2018లో ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ మరియు నటుడు నిక్ జోనాస్ తో డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 16, 2020 / 07:31 PM IST
    Follow us on


    బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నడిరోడ్డులో భర్త నిక్ జోనాస్ ని కారులోనుండి తోసేసింది. అందరూ చూస్తుండగా జరిగిన ఈ సంఘటన షాక్ గురిచేసింది. బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్లిన ప్రియాంక క్వాంటికో సిరీస్ లో నటించారు. ఆ సిరీస్ ద్వారా మంచి పేరుతెచ్చుకున్న ఈ నటి, హాలీవుడ్ లో కొన్ని యాక్షన్ చిత్రాలలో నటించడం జరిగింది. 2018లో ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ మరియు నటుడు నిక్ జోనాస్ తో డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. 38ఏళ్ల ప్రియాంక తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనాస్ ని 2018 డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు.

    Also Read: నిహారిక గురించి సాయిధరమ్ ఆసక్తికర వ్యాఖ్యలు !

    అప్పటి నుండి వీరిద్దరూ హ్యాపీ కపుల్ గా ఉంటున్నారు. న్యూయార్క్ నగరంలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన ప్రియాంక, భర్తతో అక్కడే సెటిల్ కావడం జరిగింది. అయితే భర్త అంటే ఎంతో ప్రేమ కనబరిచే ప్రియాంక ఉన్నట్లుండి, కోపానికి గురైంది. అతనిపై కోపంతో కారులోనుండి బయటికి తోసేసింది. ఐతే ఇదంతా ఓ సన్నివేశం షూటింగ్ లో భాగమే. దర్శకుడు జేమ్స్ సి స్ట్రోస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టెక్స్ట్ ఫర్ యూ మూవీలో ప్రియాంక నటిస్తున్నారు. ఈ మూవీలో చిన్న క్యామియో రోల్ నిక్ జోనాస్ చేయడం జరిగింది.

    Also Read: ‘లూసీఫ‌ర్’ రీమేక్ కి మోహ‌న్ రాజా దర్శకుడు: మెగాస్టార్ చిరంజీవి

    టెక్స్ట్ ఫర్ యూ సినిమాలోని ఓ సన్నివేశం చిత్రీకరణలో భాగంగా ప్రియాంక చోప్రా… నిక్ ని కారులోనుండి బయటికి నెట్టివేయడం జరిగింది. మరో వైపు హాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు ప్రియాంక. వి కెన్ బి హీరోస్ అనే సూపర్ హీరో చిత్రంతో పాటు ప్రఖ్యాత మ్యాట్రిక్స్ సిరీస్ లో వస్తున్న తదుపరి చిత్రంలో ప్రియాంక నటిస్తున్నారు. అలాగే ది వైట్ టైగర్ అనే హిందీ చిత్రంలో A ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఆ విధంగా బాలీవుడ్ ని హాలీవుడ్ ని బ్యాలన్స్ చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్