సలార్‌ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ !

బాహుబలి తర్వాత ప్రభాస్ టాలీవుడ్ నుండి పాన్ ఇండియా స్టార్ గా అవతరించి వరుసపెట్టి భారీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ కోవలోనే ‘కేజీఎఫ్’ లాంటి హై వోల్టేజ్ యాక్షన్ మూవీ తీసి సంచలనాలు సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం సలార్‌ సినిమా షూటింగ్ గోదావరి ఖనిలో వేసిన భారీసెట్‌ లో ‌ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో బొగ్గు గనుల్లో కొన్ని […]

Written By: admin, Updated On : February 7, 2021 9:29 am
Follow us on


బాహుబలి తర్వాత ప్రభాస్ టాలీవుడ్ నుండి పాన్ ఇండియా స్టార్ గా అవతరించి వరుసపెట్టి భారీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ కోవలోనే ‘కేజీఎఫ్’ లాంటి హై వోల్టేజ్ యాక్షన్ మూవీ తీసి సంచలనాలు సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం సలార్‌ సినిమా షూటింగ్ గోదావరి ఖనిలో వేసిన భారీసెట్‌ లో ‌ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో బొగ్గు గనుల్లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను ప్లాన్‌ చేశారు. ప్రభాస్ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: అల్లు అర్జున్ కారవాన్ ను ఢీకొట్టిన లారీ

ఈ చిత్రంలో డార్లింగ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీని తీసుకుంటారేమో అనుకున్నారు. కానీ ‘క్రాక్’ మూవీతో హిట్ అందుకుని ఫామ్ లో ఉన్న శృతిహాస‌న్ కి అవకాశం దక్కింది. తాజాగా శ్రుతిహాసన్‌ పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ… ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను కూడా భాగం చేసేందుకు డైరెక్టర్ ప్రశాంత్ కోరుకుంటున్నారని సమాచారం.

Also Read: డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడ్డ ప్రముఖ కమెడియన్.. ఎవరో తెలుసా..?

ఈ సినిమాలో మాస్ మసాలా పాటలో ఆడిపాడేందుకు ఆమెతో సంప్రదింపులు జరిపారని, కానీ ప్రియాంక ఇంకా క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తుంది. ప్రస్తుతం హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేస్తూ ఈ హాట్ భామ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆమె ఎంత అడిగినా ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారట. హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ కిరంగ‌దూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్