Actress Priyamani: ప్రముఖ నటి ప్రియమణి… దక్షిణాది సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు అని చెప్పాలి. తనదైన నటనతో జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది ఈ భామ. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం బాషలన్నింటిలో నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకుంది ప్రియమణి. ఇటీవల ఓటిటీ వేదికగా వచ్చిన “ద ఫ్యామిలీ మాన్” వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లోనూ తేన క్రేజ్ ను పెంచుకున్నారు ప్రియ. ఆమె వివాహం తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు ప్రియమణి.

ఇటీవల కాలంలోనే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బుల్లి తెర మీద జడ్జ్ గా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా ప్రియమణి, తన భర్త ముస్తాఫా రాజ్ నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ముస్తఫా తనకు మాజీ భర్త కాదని… ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని, ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించిన సంగతి తెలిసిందే.
ప్రియమణి వివాహం చెల్లదని ఆయేషా చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమరాన్ని రేపాయో చూశాం. దీంతో వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ కధనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ పుకార్లకు చెక్ పెట్టింది ప్రియమణి. ఇటీవల దీపావళి సందర్భంగా భర్త ముస్తాఫా రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసింది ప్రియ. దీంతో విడాకుల రూమర్స్‌కు నోరు విప్పకుండానే చెక్ పెట్టింది ప్రియమణి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.