Priyamani bumper offer: అందం తో పాటు అద్భుతమైన టాలెంట్ ఉన్న హీరోయిన్స్ మన సౌత్ లో చాలా తక్కువగా ఉంటారు. ఆ తక్కువ మందిలో ఒకరు ప్రియమణి(Priyamani). ఈమెకు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అందాలను ఆరబోయడం మాత్రమే కాదు, సహజమైన నటన కనబర్చడంలో ప్రియమణి దిట్ట. అందుకే అతి తక్కువ సమయం లోనే పాన్ ఇండియా లెవెల్ లో టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు ని తెచ్చుకుంది. అయితే ఈమధ్య కాలం లో ప్రియమణి సినిమాల్లో కనిపించడం లేదు. గతంలో టీవీ షోస్ లో న్యాయ నిర్ణేతగా కనిపించేది. ఇప్పుడు అది కూడా లేదు. దీంతో ప్రియమణి అభిమానులు అసలు ఈమెకు ఏమైంది?, హీరోయిన్ రోల్స్ కాకపోయినా, క్యారెక్టర్ రోల్స్ అయినా చేయొచ్చు కదా, గొప్ప నటి,ఇలా ఖాళీగా ఉండడం అసలు బాగోలేదంటూ కామెంట్స్ చేశారు.
ముఖ్యంగా టాలీవుడ్ లో ఆమె కనిపించిన చివరి చిత్రం ‘కస్టడీ’. నాగ చైతన్య హీరో గా నటించిన ఈ చిత్రంలో ప్రియమణి విలన్ రోల్ లో కనిపించింది. ఆ తర్వాత ఈమె టాలీవుడ్ లో ఎలాంటి సినిమా చేయలేదు. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ప్రియమణి కి బంపర్ ఆఫర్ తగిలిందని అంటున్నారు. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతుంది అనే విషయం తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియమణి నటించబోతుందని టాక్. రీసెంట్ గానే మేకర్స్ ఆమెని సంప్రదించడం, ఆమె వెంటనే ఓకే చెప్పడం జరిగిందని తెలుస్తోంది. ఈ చిత్రం లో మెగాస్టార్ కాస్త ఓల్డ్ ఏజ్ గెటప్ లో కనిపించనున్నాడు. అయితే ప్రియమణి కి ముందు మేకర్స్ చాలా మంది హీరోయిన్స్ ని స్పందించారు.
ముందుగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ ని సంప్రదించారు, కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆ తర్వాత రాణీ ముఖర్జీ, అనుష్క శెట్టి వంటి వారిని కూడా అడిగారు, కుదర్లేదు. చివరికి ప్రియమణి ని ఖరారు చేశారు. నటనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర అట ఇది. ఈ చిత్రం లో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్ర చేయబోతున్నాడు. అదే విధంగా ప్రముఖ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ఇందులో చిరంజీవి కి కూతురి క్యారెక్టర్ చేస్తుందట. ఈపాటికి ఈ మూవీ షూటింగ్ మొదలవ్వాలి. కానీ ఈ చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ సంస్థ ఇప్పుడు ‘జన నాయగన్’ మూవీ విషయం లో కొన్ని ఆర్ధిక ఇబ్బందులను ఎగురుకుంటూ ఉంది, అందుకే ప్రస్తుతానికి ఆగింది, మరో రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ మొదలు అవ్వొచ్చు.