Priyadarshi biography : సినిమాల్లో యాక్టింగ్ చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అందులో చాలా తక్కువ మంది సక్సెస్ అవుతుంటారు. దానికోసం అహర్నిశలు కష్టపడాలి దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు సాగినప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. కళామాతల్లి ఎవ్వరిని ఎప్పుడు తన అక్కున చేర్చుకుంటుందో ఎవరు చెప్పలేరు. మొత్తానికైతే కష్టపడే వాళ్ళకి ఇక్కడ ఎక్కువ అవకాశాలు వస్తాయనేది వాస్తవం…ఇక ఇప్పటి వరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా కొంతమంది నటులు చేసిన సినిమాలు ఎవరు గ్రీన్ గా నిలిచిపోతుంటాయి… ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రియదర్శి యంగ్ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు… ఆయన చేసిన సినిమాలేంటి ఆయన ఇండస్ట్రీకి రావడానికి గల కారణాలేంటి ఆయన్ని ఎవరు ఎంకరేజ్ చేశారు? అనేది ఒకసారి తెలుసుకుందాం…
ప్రియదర్శి 1989 ఆగస్టు 25వ తేదీన సుబ్బాచారి, జయలక్ష్మి దంపతులకు ఖమ్మంలో జన్మించాడు. ఇక తనకి ఒక అక్క కూడా ఉంది. ప్రస్తుతం ఆమె నేవీ ఆఫీసర్ గా తన బాధ్యతలను కొనసాగిస్తోంది. పుట్టింది ఖమ్మంలో అయిన కూడా ఆయన పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే కావడం వల్ల నాన్న జాబ్ నిమిత్తం హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. మొత్తానికైతే తను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండడంతో షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు…మొదట్లో వాళ్ళ అమ్మ నాన్న తనని ఎంకరేజ్ చేయకపోయిన కూడా ప్రియదర్శి వాళ్ల బాబాయ్ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ను గమనించి కావల్సిన ఫెసిలిటిలను కల్పిస్తూ తను షార్ట్ ఫిలిం చేయడానికి హెల్ప్ చేశాడట. కానీ 45 ఏళ్ల వయసు లోనే వాళ్ల బాబాయ్ చనిపోవడం ప్రియదర్శిని విపరీతమైన బాధకు గురిచేసింది…
వాళ్ళ బాబాయ్ ఇచ్చిన ప్రోత్సాహం ఊరికే పోకూడదనే ఉద్దేశ్యంతో ఎలాగైనా సరే తను నటుడిగా రాణించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. ఇంట్లో పేరెంట్స్ కి చెప్పి వాళ్లను ఒప్పించాడు. దాంతో తన ఇష్టాన్ని కనుక్కున్న వాళ్ళ నాన్న భిక్షు దగ్గరికి యాక్టింగ్ లో మెలకువలు నేర్చుకోమని పంపించాడు… భిక్షు ప్రియదర్శి షార్ట్ ఫిలిమ్స్ చూసి తన యాక్టింగ్ ఎలా ఉంది. తను ఎలాంటి విషయాల్లో ఇంకా ఇంప్రూవ్ కావాలి అనేది తెలుసుకొని తనకు మంచి శిక్షణ ఇచ్చాడు…
ఇక ప్రియదర్శి యాక్టింగ్ అయిపోయిన తర్వాత విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, అభినయ్ గోమట్టం, అభయ్ లాంటి వాళ్ళతో పరిచయం ఏర్పడింది…ఇక వాళ్ళతో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. తరుణ్ భాస్కర్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక రాజ్ కందుకూరి తరుణ్ భాస్కర్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడంతో ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో ప్రియదర్శి నటించాడు. అందులో ఒక్క డైలాగ్ తో ఆయన చాలా ఫేమస్ అయ్యాడు…
‘నా చావేదో నేను చస్తా నీకెందుకు ‘ అనే డైలాగ్ తో ఆయన బాగా ఫేమస్ అయ్యాడు…ఇక ఆ సినిమా ఇచ్చిన కిక్కు తో ఆయన వరుసగా సినిమాలు చేశాడు… టాప్ హీరోలతో వరుస సినిమాలు చేసి టాప్ నటుడిగా ఎదిగాడు… బలగం సినిమాతో హీరోగా చేసి సక్సెస్ ను సంపాదించి చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ లో వచ్చే చిన్న సినిమాలకు దొరికిన పెద్ద హీరో కూడా తనే కావడం విశేషం…ఇక రీసెంట్ గా ‘మిత్ర మండలి’ సినిమాతో వచ్చి మంచి విజయాన్ని సంపాదించుకున్నాడు…