https://oktelugu.com/

Priya Prakash Varrier: చలిలో చెమటలు పట్టించే అందాలు… విదేశీ వీధుల్లో ప్రియా ప్రకాష్ గ్లామర్ షో, వైరల్ ఫోటోలు

టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుగాంచిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ మూవీ చేసింది. నితిన్ హీరోగా నటించిన ఈ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 18, 2024 / 01:47 PM IST

    Priya Prakash Varrier

    Follow us on

    Priya Prakash Varrier: మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క కన్ను గీటుతో నేషనల్ వైడ్ పాప్యులర్ అయ్యింది. ఆమె హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం ఒరు ఆడార్ లవ్. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన క్లాస్ రూమ్ సన్నివేశం పిచ్చ వైరల్ అయ్యింది. ఆ సీన్ లో కన్ను కొట్టి ప్రియుడి గుండెల్లో గునపాలు దింపుతుంది. కన్ను కొట్టుడు భామగా ప్రియా వారియర్ పేరు మారుమ్రోగింది. ఒరు ఆడార్ లవ్ మూవీ అంతగా ఆడలేదు. అయినా ప్రియా వారియర్ మాత్రం ఫేమస్ అయ్యింది.

    అనంతరం టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుగాంచిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ మూవీ చేసింది. నితిన్ హీరోగా నటించిన ఈ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసింది. ఈమె పాత్ర నిడివి కూడా తక్కువే. చెక్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. తేజ సజ్జాకు జంటగా ఇష్క్ మూవీలో నటించింది. ఇది కూడా ఫలితం ఇవ్వలేదు.

    తెలుగులో ప్రియా ప్రకాష్ వారియర్ మూడో చిత్రం బ్రో. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ లో ప్రియా వారియర్ కీలక రోల్ చేసింది. సముద్ర ఖని తెరకెక్కించిన ఈ చిత్రం ఓ మోస్తరు విజయం సాధించింది. సాయి ధరమ్ చెల్లిగా ప్రియా వారియర్ నటించడం విశేషం. తెలుగులో ప్రియా ప్రకాష్ వారియర్ కథ ముగిసినట్లే. హిందీలో ఆమెకు అడపాదడపా ఆఫర్స్ వస్తున్నాయి.

    శ్రీదేవి బంగ్లా టైటిల్ తో ప్రియా ప్రకాష్ వారియర్ వివాదాస్పద చిత్రం చేసింది.నటి శ్రీదేవి జీవిత కథను పోలినట్లు ఉన్న ఆ మూవీ ఆగిపోయింది. లీగల్ ట్రబుల్స్ లో ఇరుక్కోగా షూటింగ్ ఆపేశారు. శ్రీదేవి బంగ్లా ప్రోమో సంచలనం రేపింది. అమ్మడు కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు.

    సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తుంది. తాజాగా విదేశీ వీధుల్లో గ్లామర్ షో చేసింది. క్లీవేజ్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ప్రియా ప్రకాష్ వారియర్ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ ఆమె ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్ ని ఇంస్టాగ్రామ్ 7.6 మిలియన్ ఫాలో అవుతున్నారు. అమ్మడు అందాలకు ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంది మరి.