https://oktelugu.com/

Priya Bhavani Shankar : ఒకప్పుడు న్యూస్ రీడర్.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ హీరోయిన్.. ఎవరో తెలుసా..

కెరియర్ స్టార్టింగ్ లో న్యూస్ రీడర్గా చేసి ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయిన వాళ్లలో ప్రియా భవాని శంకర్ కూడా ఒకరు. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు.

Written By:
  • Mahi
  • , Updated On : January 15, 2025 / 09:34 PM IST

    Priya Bhavani Shankar

    Follow us on

    Priya Bhavani Shankar : సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత తమ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన వాళ్లు ప్రస్తుతం హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్న వాళ్లు చాలామంది ఉన్నారు. మొదట్లో సినిమాలలో చిన్న చిన్న పాత్రలో నటించినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత హీరో లేదా హీరోయిన్ గా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. భాష ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. అలాగే తమ కెరియర్ ప్రారంభంలో యాంకర్ గా లేదా న్యూస్ రీడర్ గా చేసిన వాళ్లు కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. తమ టాలెంట్ బయట పెడుతూ వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ సినిమా ఇండస్ట్రీలో బిజీగా మారిపోతున్నారు. ఇదే గ్రామంలో కెరియర్ స్టార్టింగ్ లో న్యూస్ రీడర్గా చేసి ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయిన వాళ్లలో ప్రియా భవాని శంకర్ కూడా ఒకరు. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు. ఒకప్పుడు ప్రియా భవాని శంకర్ న్యూస్ రీడర్ గా చేసేది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తమిళనాడులో పుట్టి పెరిగిన ఈమె న్యూస్ రీడర్గా ఇండస్ట్రీలో తన కెరీర్ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ప్రియా భవాని శంకర్ బుల్లితెర మీద 2014లో సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత 2017 లో మేయా ధమాన్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో, అభినయంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇలా తమిళ్లో మంచి సక్సెస్ అందుకున్న ప్రియా భవాని శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటుంది.

    ఈమె తెలుగులో కళ్యాణం కమనీయం, ఏనుగు, రుద్రుడు, చినబాబు, తిరు, అహం బ్రహ్మస్మి, భీమా, రత్నం, జీబ్రా వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో తన కెరియర్ పరంగా బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది. ఈమె తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యూ రీడర్ గా అలాగే నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. సినిమాలతో పాటు ప్రియా భవాని శంకర్ వెబ్ సిరీస్లలో కూడా నటిస్తుంది. అలాగే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

    తనకు సంబంధించిన సినిమా విషయాలను లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 2023లో ఈమె నటించినా దూత అనే వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతుంది. ఇలా ఈమె తమిళ నటి అయినప్పటికీ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది అని చెప్పడం లో సందేహం లేదు.ప్రస్తుతం తెలుగు లో బిజీ గా ఉన్న హీరోయిన్ లలో ప్రియా భవాని శంకర్ కూడా ఒకరు.