Prudhvi Raj Marriage: నటుడు పృథ్వీరాజ్ యంగ్ కొరియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా మీడియాలో ఇది హాట్ టాపిక్ గా ఉంది. ఈ క్రమంలో పృథ్వి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆయన వివాహం చేసుకోబోయే అమ్మాయితో పాటు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నా వయసు ఎంతో? నేనేమిటో? అన్నీ తెలిసిన అమ్మాయి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మధ్యలో మీకేంటి బాధ అని ఆయన ప్రశ్నించారు. ఇంటర్వ్యూలో పృథ్వి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పృథ్వి వివాహం చేసుకోబోయే అమ్మాయి పేరు శీతల్. కొరియన్ అయినప్పటికీ ఆమె తెలుగు, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నారు. కొరియన్ భాష మాత్రం కొంచెం కొంచెం వచ్చు. పృథ్వి వ్యక్తిత్వం బాగా నచ్చింది. ఆయనతో నా జర్నీ బాగుంటుందనే నమ్మకం ఉంది. అందుకే పెళ్లి చేసుకోవాలి నిర్ణయించుకున్నానని శీతల్ అన్నారు. పెద్ద వయసున్న వ్యక్తిని వివాహం చేసుకుంటాను అంటే… మీ కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏమిటి? అని అడగ్గా… వాళ్లకు ఎలాంటి అభ్యంతరం లేదు. అమ్మ, సిస్టర్ ఈ విషయాన్ని అంగీకరించారు. పృథ్వితో వాళ్లకు మంచి సాన్నిహిత్యం ఉందని శీతల్ చెప్పుకొచ్చారు.
57 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే తప్పేంటని పృథ్వి ఎదురు ప్రశ్నించారు. మా ఇద్దరి మధ్య అవగాహన కుదిరింది. నా వయసు గురించి ఆమెకు తెలుసు. మిగతా వాళ్లకు ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నారు. శీతల్ ని పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే ఆలోచన ఉండేది. మీడియాలో నా పెళ్లి వార్త హైలెట్ అయ్యాక ఇక తప్పదని డిసైడ్ అయ్యాను. అప్పటి వరకు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని పృథ్వి చెప్పుకొచ్చారు.
ఇక మొదటి భార్య గురించి కూడా పృథ్వి తన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆమె చాలా ప్రైవేట్ పర్సన్. ఎవరైనా ఇంటర్వ్యూ, మీటింగ్ అని ఇంటికి వచ్చినా ఆమెకు నచ్చేది కాదు. ఇవన్నీ బయటపెట్టుకోండి ఇంట్లో వద్దనేది. నా సక్సెస్ ని కూడా ఆమె ఎంజాయ్ చేయదు. నాతో కలిసి రాదు. ఆ కారణంతోనే విడిపోవాల్సి వచ్చిందన్నారు. ఇక కొడుకుతో రిలేషన్ గురించి మాట్లాడుతూ… కోర్ట్ ఆర్డర్ ప్రకారం తల్లి వద్దే పెరుగుతున్నాడు. వాడితో సాన్నిహిత్యం ఉందని పృథ్వి చెప్పారు.

పృథ్వి కొడుకుతో శీతల్ కి కూడా పరిచయం ఉందట. బెంగుళూరులో నేను మొదటి కలిసింది పృథ్వి రాజ్ కుమారుడినే అన్నారు. ఒకవేళ అతడు తండ్రి వద్దకు వచ్చేస్తే కొడుకుగా చూసుకోవడానికి సిద్ధమని శీతల్ చెప్పుకొచ్చారు. 1994లో బీనా అనే మహిళను పృథ్వి వివాహం చేసుకున్నారు. 1995లో కొడుకు పుట్టాడు. అతడి పేరు అహెద్. అంటే దాదాపు శీతల్ వయసుకు దగ్గరగా ఉంటుంది. శీతల్ ని ఇంకా వివాహం చేసుకోలేదు. కానీ త్వరలోనే మా వివాహమని పృథ్వి తేల్చిచెప్పారు.