Homeఎంటర్టైన్మెంట్Prince Yawar: బిగ్ బాస్ లో సైకో : వీడేందయ్యా వీడు పెద్ద సైకో గాడిలా...

Prince Yawar: బిగ్ బాస్ లో సైకో : వీడేందయ్యా వీడు పెద్ద సైకో గాడిలా ఉన్నాడు…ప్రిన్స్ యవ్వారం పెనుదుమారం

Prince Yawar: బిగ్ బాస్ ఎంత పెద్ద రియాలిటీ షో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ అయిన ప్రతి సీజన్ విపరీతమైన ప్రేక్షకాదరణ పొందడంతో పాటు అత్యధిక రేటింగ్ ని కూడా సొంతం చేసుకుంటుంది. అయితే సీజన్లో సక్సెస్ పరంగా బిగ్ బాస్ కాస్త వెనకడుగు వేసింది. దీంతో ఈసారి ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ ఏడవ సీజన్ ని నిజంగా ఉల్టా పుల్టా గాని చూపిస్తున్నారు.

కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలుపెట్టిన బిగ్ బాస్ వారానికి ఒక కొత్త పందాలో సాగుతోంది. పవర్ అస్త్ర గెలిచిన వాళ్లను.. హౌస్ మేట్స్ గా గుర్తించడంతోపాటు వాళ్లకి కొన్ని వారాల ఇమ్యూనిటీని ఇస్తున్నారు. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ లో పవర్ అస్సరా సొంతం చేసుకోవాలి అన్న తపన ఎక్కువ అవుతుంది. ఇప్పటివరకు ఆట సందీప్ ,శివాజీ రెండు పవర్ అస్త్రాలను సంపాదించి హౌస్ మేట్స్ గా గుర్తింపు పొందడంతో పాటు ఎలిమినేషన్స్ నుంచి కొన్ని వారాలు తప్పించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో హౌస్ లో మూడవ వారం పవర్ వస్త్రా కోసం పోటీ ప్రారంభమైంది. అయితే ఇందులో సరికొత్త ట్విస్ట్ ఏమిటంటే పోటీలో పాల్గొనే పోటీ దారులను నేరుగా బిగ్ బాస్ ఎంపిక చేశాడు. మూడవ వారం జరగబోయే పవర్ అస్త్ర కోసం అమర్‌దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌ లను బిగ్బాస్ చూస్ చేసుకున్నారు. బిగ్ బాస్ తమని ఎంచుకోవడంతో ఈ ముగ్గురు యమ కుష్ అవుతుంటే.. మరోపక్క ప్రశాంత్, దామిని ,ప్రియాంక.. తో సహా మిగిలిన కంటెస్టెంట్ కాస్త నిరాశ చెందారు.

అయితే విషయం అక్కడితో అయిపోలేదు.. తరువాత మిగిలిన కంటెస్టెంట్స్ ని ఒకరి తర్వాత ఒకరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి బిగ్ బాస్ ఈ ముగ్గురిలో అనర్హులు ఎవరో చెప్పాలి అని అడిగాడు. అయితే పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణా ,శుభశ్రీ… శోభా శెట్టి పేరు చెప్పగా..రతికా రోజ్, దామిని, తేజలు మాత్రం ప్రిన్స్ యావర్ పేరు చెప్పారు. ఒక ప్రియాంక జైన్ మాత్రం..అమర్ దీప్, శోభా శెట్టి ఇద్దరి పేర్లు చెప్పింది. దీంతో ఎక్కువ శాతం ఓట్లు శోభాకే పడ్డాయి.

అయితే కన్ఫెక్షన్ రూమ్లో కంటెస్టెన్సీ ఎవరికీ ఓట్లు వేశారు,ఏ కారణాలు చెప్పారో బిగ్ బాస్ శుభ్రంగా హౌస్ లో పెద్ద స్క్రీన్ మీద చూపించాడు. ఫస్ట్ ప్రిన్స్ కి సంబంధించిన ఓటింగ్ను ప్లే చేయడం జరిగింది. దీంతో ఎప్పటిలాగా కోప్పడుతూ అందరి మీద ప్రిన్స్ గొడవకు సిద్ధం అవ్వడమే కాకుండా తేజ పై బాగా సీరియస్ అయ్యాడు. స్మోకింగ్ జోన్ లో ఉన్న ప్రిన్స్ ను కంట్రోల్ చేయడానికి శోభా ఎంత ట్రై చేసినా ఫలితం మాత్రం లేకుండా పోయింది. కోపంలో ప్రిన్స్ తన ఎదురుగా ఉన్న టీపాయ్ గ్లాసును పగలగొట్టడానికి ప్రయత్నించాడు. అయితే ప్రిన్స్ ప్రవర్తన ప్రస్తుతం సోషల్ మీడియాలో అతన్ని ఒక పెద్ద సైకోలాగా మార్చేసింది.

ప్రిన్స్ యావర్‌ ఉగ్రరూపం చూసిన కంటెస్టెంట్లు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఒక్కరు కూడా అతని దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడలేదు. అయితే కాసేపటికి ప్రిన్స్ మళ్లీ నార్మల్ అవ్వడంతో ప్రియాంక వెళ్లి అతనితో కాస్త మాట్లాడింది. అయితే మొత్తానికి ప్రిన్స్ ప్రవర్తన మాత్రం ప్రేక్షకులలో అతనికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తెచ్చింది. దీని ప్రభావం కచ్చితంగా అతని ఓటింగ్ పై కూడా పడే అవకాశం కనిపిస్తోంది.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular