Atithi Web Series Review: ఒక సినిమా చూస్తున్నంత సేపు మనలో కొన్ని రకాలైన భావోద్వేగాలు రేకెత్తుతాయి… అయితే కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు చాలా భయంగా అనిపించినప్పటికీ దాంట్లో ఉన్న ఆ మెయిన్ ఫ్లాట్ కి మనం కనెక్ట్ అయితే మాత్రం హార్రర్ సినిమా అయినా కూడా బోర్ లేకుండా, భయం లేకుండా చూస్తూనే ఉంటం సరిగ్గా అలాంటి ఒక దయ్యం కథతో తిసినదే ఈ అతిధి… ఈ అతిధి లో అక్కడక్కడ నరాలు తెగిపోయే భయం పుట్టినప్పటికీ హార్రర్ సినిమాలు ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఆసక్తితో చూస్తూ ఉంటారు…ఇక ఈ సీరీస్ లో వేణు తెట్టంపూడి లీడ్ రోల్ లో చేశారు.ఇక ఇప్పటికే ఇది ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది…అతిధి సీరీస్ కి సంభందించిన పూర్తి మ్యాటర్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ముందుగా ఈ స్టోరీ లోకి వెళ్తే రవివర్మ ఒక రాజభవనం… ఒక నలుగురు మనుషుల చుట్టూ తిరిగే కథగా ఇది తెరకెక్కింది. ఈ సినిమా అధ్యంతం హర్రర్ అంశాలను మేలవిస్తూ డైరెక్టర్ చాలా గొప్పగా సినిమాని తెరకెక్కించాడు. ఎంతవరకైతే హర్రర్ ఎలిమెంట్స్ ఉండాలి, ఎంతవరకు ఎమోషన్ పార్ట్ ఉండాలి అనేది సరిగ్గా క్యాలిక్యులేటర్ గా బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమాను తీశాడు అలాగే సినిమా టైటిల్ లో ఉన్నట్టు గానే ఎవరు ఎవరి జీవితానికి అతిధి అనేది తెలియాలంటే ఈ అతిధిని మీరు చూడాల్సిందే అయితే చుస్తున్నత సేపు ఎక్కడ బోర్ లేకుండా చాలా సాఫీగా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ ఉండేలా ఇంట్రెస్ట్ ఆఫ్ ఎలెమెంట్స్ ఉండేలా చూసుకున్నాడూ డైరెక్టర్….
ఇక రాజభవనానికి హీరో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు ఆ రాజభవనంలో ఏం జరుగుతుంది హీరో కి అక్కడ ఉన్న మిగితా వ్యక్తులకి మధ్య సంబంధం ఏంటి ఆ దయ్యమికి హీరో కి మధ్య సంబంధం ఏంటి లాంటి ప్రశ్నలకి సమాధానం దొరకలంటే డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ అతిధి సిరీస్ ని మీరు చూడాల్సిందే…
ఇక చాలా సినిమాల్లో మంచి హీరోగా నటుడిగా మంచి గుర్తింపు పొందిన వేణు ఈ పాత్ర పోషించడం జరిగింది. ఇందులో ఆయన చేసిన పాత్ర చాలా ప్రామిసింగ్ గా ఉంటుంది. ఇప్పటివరకు ఆయన ఎప్పుడు చేయని విధంగా చాలా కొత్తగా ఉంటుంది అలాగే డైరెక్టర్ వై జి భరత్ కూడా ఈ స్టోరీని చాలా వరకు ఫ్రెష్ ఫీల్ ఉండే విధంగా రాసుకొని మిగతా హర్రర్ సినిమాలకి బంధం లేకుండా చాలా కొత్తగా తన మేకింగ్ తో ప్రజెంట్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక సాంకేతిక నిపుణుల పని తీరు కూడా ఈ సినిమాకి చాలా వరకు కలిసి వచ్చిందనే చెప్పాలి… మొత్తానికైతే వేణు తొట్టెంపూడి కి ఈ అతిధితో ఆయన లైఫ్ లోకి ఒక అతిధి అనే సక్సెస్ వచ్చిందని చెప్పాలి…