Prince Movie First Review రెమో, డాక్టర్ వంటి చిత్రాలతో తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు హీరో శివ కార్తికేయన్. తెలుగు ప్రేక్షకులకు బాగా టచ్ లో ఉండే శివ కార్తికేయన్ కి టాలీవుడ్ లో కూడా మార్కెట్ ఉంది. దీంతో తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి ఆయన చిత్రాలు విడుదల చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ ప్రిన్స్. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు. ప్రిన్స్ టీజర్, ట్రైలర్ మంచి స్పందన దక్కించుకున్నాయి. ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచాయి . దీంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. అక్టోబర్ 21న తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్ ప్రిన్స్ విడుదల కానుంది.

ప్రిన్స్ మూవీ విడుదలకు ముందే టాక్ బయటకు వచ్చింది. ఫిలిం క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు తన ఒపీనియన్ చెప్పాడు. ప్రిన్స్ మూవీ ఎలా ఉందో ఆయన ట్వీట్ చేశాడు. ఉమర్ సంధు రివ్యూ ప్రకారం ప్రిన్స్ ఆకట్టుకోలేదు. ఎలాంటి కొత్తదనం లేకుండా నిరాశపరిచేలా తెరకెక్కింది. రెండు మాటల్లో ప్రిన్స్ మూవీ ఎలా ఉందో ఉమర్ సంధు తేల్చిపారేశారు. ప్రిన్స్ మూవీ చూశాను, చాలా బోరింగ్ గా ఉంది. ఇది కొత్త జాడీలో పెట్టిన పాత చింతకాయ పచ్చడి అంటూ ట్వీట్ చేశాడు.
ఉమర్ సంధు ట్వీట్ మేకర్స్ తో పాటు ఫ్యాన్స్ ని నిరాశపరిచేదిగా ఉంది. మరి ఆయన చెప్పింది నిజమైతే ప్రిన్స్ ప్లాప్ అయ్యే సూచనలు కలవు. అయితే ఉమర్ సంధు రివ్యూ నమ్మాల్సిన పనిలేదు. గతంలో ఆయన బ్లాక్ బస్టర్ అని చెప్పిన సినిమాలు డిజాస్టర్ కాగా.. డిజాస్టర్ అన్నవి బ్లాక్ బస్టర్ అయ్యాయి. కాబట్టి ఆయన జడ్జిమెంట్ నమ్మలేం. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్, పొన్నియిన్ సెల్వన్ చిత్రాలకు ఆయన నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. కానీ అవి విజయాలు అందుకున్నాయి.
కాబట్టి ఉమర్ సంధు రివ్యూ ఫైనల్ అని చెప్పలేం. మరికొన్ని గంటల్లో యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శన జరగనుంది. ప్రేక్షకులే స్వయంగా తమ జడ్జిమెంట్ ఇవ్వనున్నారు. శివ కార్తికేయన్ గత రెండు చిత్రాలు డాక్టర్, డాన్ సక్సెస్ అయ్యాయి. దీంతో ఆయన లేటెస్ట్ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక దర్శకుడు అనుదీప్ కేవీ జాతిరత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డెబ్యూ మూవీతో సంచలన విజయం నమోదు చేశాడు. ప్రిన్స్ అనుదీప్ రెండవ చిత్రం కావడం విశేషం.