https://oktelugu.com/

Bigg Boss Telugu 8: గౌతమ్ ని రోజుకో కొత్త పద్దతిలో టార్చర్ చేస్తున్న ప్రేరణ..పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్న రోహిణి!

వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కూడా సీతాఫలం తిన్నందుకు గౌతమ్ కి, స్వీట్ ని తిన్నందుకు నబీల్ కి శిక్షలు ఇవ్వమని చెప్తాడు. ప్రేరణ బాగా అలోచించి నబీల్ కి చాలా ఫన్నీ శిక్ష ఇస్తుంది. కానీ గౌతమ్ కి మాత్రం ప్రతీరోజు వంటింట్లో ఉన్న అంట్లు తోమాలి అని చెప్తుంది. నేనొక్కడినే అన్ని అంట్లు తోమాలా? అని గౌతమ్ అడగగా, సపోర్టుగా ఒకరిని ఇస్తాను అని అంటుంది ప్రేరణ.

Written By:
  • Vicky
  • , Updated On : November 13, 2024 8:27 am

    Gotham Vs Prerana

    Follow us on

    Bigg Boss Telugu 8:  వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా గౌతమ్ లోపలకు వచ్చిన మొదటిరోజు నుండి నేటి వరకు ఆయన బాగా క్లోజ్ గా ఉంటున్నవారిలో ఒకరు ప్రేరణ. వీళ్లిద్దరు బయట ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కాబట్టి, వీళ్ళ మధ్య ఒక ప్రత్యేకమైన బాండింగ్ ఏర్పడింది. అయితే ఈ వారం ఆ బాండింగ్ కి బీటలు పడినట్టు స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రేరణ కి ఎందుకో గౌతమ్ చేసే పనులు నచ్చడం లేదు. అందుకే మెగా చీఫ్

    తర్వాత గౌతమ్ ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి అతన్ని రోజుకో విధంగా టార్చర్ చేస్తుంది. సీతాఫలం పండ్లు గౌతమ్ ఒక్కడే తిన్నప్పటి నుండి ఈ గొడవ మొదలు అవుతుంది. నాలుగు సీతాఫలం పండ్లు తిన్నావు, ఇక మిగిలింది ఒక్కటి, దానిని తినకు, అందరం షేర్ చేసుకోవాలి అని చెప్పిన తర్వాత కూడా నువ్వు తినేసావు చూడు, మళ్ళీ సిగ్గు లేకుండా నవ్వుతున్నావ్ అని అంటుంది ప్రేరణ. గౌతమ్ దీనిని అంత సీరియస్ గా తీసుకోడు, సరే తప్పు చేసిన ఎదో ఒక శిక్ష ఇవ్వు అని ఆయనే అంటాడు.

    వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కూడా సీతాఫలం తిన్నందుకు గౌతమ్ కి, స్వీట్ ని తిన్నందుకు నబీల్ కి శిక్షలు ఇవ్వమని చెప్తాడు. ప్రేరణ బాగా అలోచించి నబీల్ కి చాలా ఫన్నీ శిక్ష ఇస్తుంది. కానీ గౌతమ్ కి మాత్రం ప్రతీరోజు వంటింట్లో ఉన్న అంట్లు తోమాలి అని చెప్తుంది. నేనొక్కడినే అన్ని అంట్లు తోమాలా? అని గౌతమ్ అడగగా, సపోర్టుగా ఒకరిని ఇస్తాను అని అంటుంది ప్రేరణ. ఇదంతా పక్కన పెడితే నిన్నటి ఎపిసోడ్ లో ఉదయం వంట చేయడానికి అంట్లు అవసరం ఉండగా, గౌతమ్ ని పిలిచి అంట్లు తోము అని ఆడిస్తుంది ప్రేరణ. అప్పుడు గౌతమ్ కచ్చితంగా చేస్తాను, కానీ నాకు ఎవరినో ఒకరిని సపోర్టు పంపు అని అడుగుతాడు. సపోర్టు అవసరమయ్యేంత అంట్లు అక్కడ లేవు, నువ్వు ఒక్కడివే చేసేయొచ్చు అని అంటుంది ప్రేరణ. అప్పుడు గౌతమ్ సపోర్టు లేకపోతే నేను ఈ పని చేయను అని అంటాడు.

    గొడవ జరగబోతుంది అనేది పసిగట్టిన రోహిణి, ఎందుకు ఈ విషయం లో గొడవ, నేను వస్తాను సపోర్టుగా పదా అని రోహిణి లోపలకు వెళ్తుంది. రోహిణి తో పాటు గౌతమ్ కూడా వెళ్లి వంటింట్లో అంట్లు తోముతూ ఉంటాడు. ఇక్కడితో ప్రేరణ వదిలేసి ఉండుంటే బాగుండేది, కానీ వంటింట్లోకి వెళ్లిన తర్వాత గౌతమ్ తో గొడవలు పెట్టుకుంటుంది. నేను మెగా చీఫ్ ని, నీకు శిక్ష ఇచ్చినప్పుడు నువ్వు కచ్చితంగా ఆ శిక్షని అంగీకరించి పని చేయాలి అంటుంది. శిక్ష ని నేను కచ్చితంగా చేయాలి అని నేను కూడా అనుకోవాలి కదా, నువ్వేదో నా మీద పగ పెట్టుకొని చేస్తున్నట్టు ఉంది, ఇది కరెక్ట్ కాదు అని అంటాడు గౌతమ్. అలా వీళ్లిద్దరి మధ్య గొడవ పెరిగిపోతుంది. గౌతమ్ ఆవేశం బిగ్ బాస్ హిస్టరీ లోనే ప్రేరణ ని ‘ది వరస్ట్ మెగా చీఫ్’ అని అంటాడు. దానికి ప్రేరణ ‘నువ్వు వరస్ట్ కంటెస్టెంట్’ అని అంటుంది. అలా ఇద్దరు ఒకరి మీద ఒకరు మాటలు విసురుకుంటారు, గౌతమ్ మీద ప్రేరణనే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినట్టుగా అందరికీ అనిపించింది. ఈ గొడవలో గౌతమ్ తప్పు కూడా ఉంది, కానీ ప్రేరణ ఓవర్ యాక్షన్ వల్ల గౌతమ్ తప్పు జనాలకు అంతగా కనిపించలేదు.