Bigg Boss 8 Telugu Finale LIVE: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మగవాళ్ళతో సమానంగా, ఆడపులి లాగా ఆడిన కంటెస్టెంట్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు ప్రేరణ కంభం. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు ఈమె స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ లో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ని దక్కించుకుంది. ఆ తర్వాత ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ అనే షో లో మగవాళ్ళతో సమానంగా ఈమె ఆడే టాస్కులను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కచ్చితంగా ఈమె బిగ్ బాస్ కి వెళ్తుందని అనుకున్నారు. అనుకున్నట్టు గానే బిగ్ బాస్ కి వచ్చింది. మొదటి రోజు ఏ జోష్ తో అయితే ఆమె ఉన్నిందో, అదే జోష్ తో ఈరోజు వరకు కొనసాగింది. ఆడపులి లాగ ప్రతీ టాస్క్ లోనూ తన బెస్ట్ ఇచ్చింది.
అయితే ఈ 15 వారాలకు ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ బిగ్ బాస్ హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డు అని అంటున్నారు. రోజుకి ఈమెకి 32 వేల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తామని బిగ్ బాస్ టీం ఒప్పందం చేసుకుందట. ఆ ఒప్పందం ప్రకారం చూస్తే ఈమె 15 వారాలకు 33 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంది. ఈరోజు ఆమెని హౌస్ నుండి ప్రముఖ హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ తీసుకొచ్చింది. ప్రజ్ఞ జైస్వాల్ ఇప్పటి వరకు ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోలేదు. అలా ప్రేరణ బిగ్ బాస్ హిస్టరీ లో సరికొత్త రికార్డు ని నెలకొల్పింది. అయితే ఈమె ఉన్నప్పుడు సూట్ కేసు ఆఫర్ ఇచ్చి ఉండుంటే కచ్చితంగా తీసుకొచ్చేది. అది కూడా తోడు అయ్యుంటే ఈమె రెమ్యూనరేషన్ అరకోటికి పైగానే ఉండేది అని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.
#Prerana is evicted as Top 4 contestant of S8.#BiggBossTelugu8 pic.twitter.com/IocSKVYRqa
— TeluguBigg (@TeluguBigg) December 15, 2024